Mangaluru Auto Blast: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మంగళూరు ఆటో పేలుడు కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ పేలుడు కేసులో కీలక సూత్రధారితో సంబంధం ఉన్న ఇద్దరిని అధికారులు అరెస్ట్ చేశారు. పేలుళ్లకు కుట్ర పన్నిన మహ్మద్ షరీఖ్‌కు సహకరించిన ఇద్దరిని కర్ణాటకలో అదుపులోకి తీసుకున్నారు. షరీఖ్‌తో ఎలాంటి సంబంధాలున్నాయి..? ఇంకా ఎవరెవరితో పరిచయముంది అన్న అంశాలపై పోలీసులు, ఎన్ఐఏ అధికారులు విచారిస్తున్నారు. ఎన్ఐఏ కూడా రంగంలోకి దిగి.. పలు కీలకవిషయాలను సేకరించింది. దీనివెనుక ఉగ్రసంస్థలు ఉన్నట్లు ఇప్పటికే నిర్ధారించారు.
నిందితుడు షరీఖ్‌కు ఐసిస్ ఉగ్రసంస్థతో సంబంధాలున్నాయని.. ఉగ్రవాదులను సంప్రదించడానికి డార్క్ వెబ్‌ను ఉపయోగించాడని పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో పోలీసులు పెద్ద పురోగతిని సాధించినట్లు తెలుస్తోంది. షరీఖ్ బహుళ హ్యాండ్లర్ల క్రింద పనిచేశాడని, వారిలో ఒకరు ఐసిస్‌తో ప్రభావితమైన ఉగ్రవాద సంస్థ అయిన అల్ హింద్‌కు చెందినవారు అని కర్ణాటక డీజీపీ అలోక్ కుమార్ తెలిపారు. రెండు కేసుల్లో నిందితుడిగా ఉన్న అరాఫత్ అలీ షరీఖ్‌తో టచ్‌లో ఉన్నాడని పోలీసులు వెల్లడించారు. అల్-హింద్ మాడ్యూల్ కేసులో నిందితుడిగా ఉన్న ముస్సావిర్ హుస్సేన్‌తో కూడా టచ్‌లో ఉన్నాడన్నారు. అబ్దుల్ మతిన్ తాహా షరీఖ్ ప్రధాన హ్యాండ్లర్‌లో ఒకడని డీజీపీ పేర్కొ్న్నారు. పీఎఫ్‌ఐ సంస్థతో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు.
Employees Shock To Twitter : ట్విటర్‌కు షాక్.. ఒకే సారి 1200మంది ఉద్యోగుల రాజీనామా
పేలుడుకు ముందు తమిళనాడులోని వివిధ ప్రాంతాల్లో తిరిగాడు షరీఖ్. ఫేక్ ఆధార్‌కార్డుతో కర్నాటక లోని పలు ప్రాంతాల్లో గదిని అద్దెకు తీసుకున్నాడు. 2020లో కూడా ఉగ్రవాద నిరోధక చట్టం కింద షరీఖ్ అరెస్టయ్యాడు. అనంతరం సాంకేతిక కారణాల వల్ల షరీఖ్ బెయిల్‌పై విడుదలయ్యాడు. పేలుడుకు ముందు తమిళనాడులోని వివిధ ప్రాంతాల్లో షరిఖ్ తిరిగాడని.. పలువురిని కలిసినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. వారందరినీ.. పట్టుకునేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మంగళూరు బ్లాస్ట్ కేసు విచారణలో మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయని పేర్కొంటున్నారు. ఈ కేసులో ఓ ప్రైవేట్ టీచర్‌ను ఎన్‌ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పేలుడుకు కారణమైన మహ్మద్ షరీఖ్‌కు కోయంబత్తూరు లింకులు ఉన్నట్లు గుర్తించారు. కోయంబత్తూరులోని ఓ ప్రైవేట్ టీచర్ సురేందర్.. గాంధీపురంలోని లాడ్జిలో నెల క్రితం ఉన్నట్టు సమాచారం. ఊటీలో స్కూల్ టీచర్‌గా సురేందర్ పనిచేస్తున్న సురేందర్‌ను అదుపులోకి తీసుకున్న అధికారులు విచారించేందుకు సిద్దమవుతున్నారు. ఆటో పేలుడు కేసును మంగళూరు పోలీసులతో పాటు ఎన్‌ఐఏ అధికారులు కూడా విచారిస్తున్నారు.