Cleaned With Cow Urine: ఈ ఘటన అనంతరం దళితులపై దాడులు, అణచివేతలపై మరోసారి ప్రశ్నలు మొదలయ్యాయి. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు దాటిన తర్వాత కూడా దళితులు ఇంకా సమానత్వం కోసం పోరాడుతూనే ఉన్నారు. దళితులపై హింసకు సంబంధించి అనేక సంఘటనలు ప్రతియేటా వినిపిస్తూనే ఉన్నాయి. ఎన్నో చోట్లు దళితులకు ఘోర అవమానాలు ఎదురైన ఘటనలు ఎన్నో ఉన్నాయి. తాజాగా కర్ణాటకలో ఓ గ్రామంలో దళిత వర్గానికి చెందిన మహిళ కుళాయి నీరు తాగిందని ఆ ట్యాంక్‌ను గోమూత్రంతో శుద్ధి చేశారు.
నవంబర్ 18న కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లా హెగ్గోతర గ్రామంలో వివాహ కార్యక్రమానికి హాజరైన ఓ షెడ్యూల్డ్ కులానికి చెందిన మహిళ.. అగ్రవర్ణాల వారు నివసించే ప్రాంతంలోని తాగునీటి ట్యాంక్‌లోని నీటిని తాగింది. ఆగ్రహానికి గురైన వారు ట్యాంక్‌లోని నీరంతా విడుదల చేసి, కొందరు పవిత్రంగా భావించే గోమూత్రంతో శుభ్రం చేశారు. వాటర్ ట్యాంక్ శుభ్రం చేశారు కానీ అది గోమూత్రమో కాదో తాను నిర్ధారించలేనని తహసీల్దార్ బస్వరాజ్ అన్నారు. సదరు మహిళ ట్యాంక్ నుంచి నీరు తాగడం కూడా ఎవరూ చూడలేదని.. ఆమె తాగిందో లేదో కూడా తెలియదన్నారు. ఈ ఘటనపై వివక్ష కేసు నమోదు చేస్తామని బస్వరాజ్ చెప్పారు.
Joe Biden Birthday: జో! ఐ లవ్ యు.. అమెరికన్ ఫస్ట్ లేడీ స్పెషల్ విషెస్
గ్రామంలో అనేక ట్యాంకులు ఉన్నాయి, అక్కడ నుండి ప్రతి ఒక్కరూ నీరు త్రాగవచ్చన్నారు. ఈ ఘటన తర్వాత స్థానిక అధికారులు దళిత, ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) వర్గాలకు చెందిన పలువురు గ్రామస్తులను అన్ని ట్యాంకుల వద్దకు తీసుకెళ్లి నీళ్లు తాగించారు. తదుపరి చర్యల కోసం తహశీల్దార్ జిల్లా కలెక్టర్‌కు సమగ్ర నివేదిక అందజేస్తారని తెలిపారు.