ఈ ఏడాది సెప్టెంబరులో ఇరాన్‌లో పోలీసు కస్టడీలో ఉన్న 22 ఏళ్ల మహ్సా అమిని మరణించిన సంగతి తెలిసిందే. మహ్సా అమిని హిజాబ్ సరిగ్గా ధరించలేదని చెబుతూ ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తరువాత ఆమె మరణించింది. ఇది జరిగినప్పటి నుంచి ఇరాన్ వ్యాప్తంగా మహిళలు, యువత పెద్ద ఎత్తున నిరసన, ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది.
ఒడిశా తీరంలోని ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి బుధవారం ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణి అగ్ని-3 శిక్షణా ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. సాధారణ శిక్షణలో భాగంగా సైనిక దళాల్లోని వ్యూహాత్మక కమాండ్ ఈ ప్రయోగాన్ని నిర్వహించింది.
దేశంలో ఎక్కడో ఓ చోట అఘాయిత్యాలు జరుగుతున్నాయి. పంజాబ్‌లోని జలంధర్‌కు చెందిన ఓ వ్యక్తి 20 నుంచి 23 ఏళ్ల వయస్సు గల నలుగురు అమ్మాయిలు తెల్లని కారులో కిడ్నాప్ చేసి తన కళ్లలో ఏదో రసాయనం చల్లి తనకు మత్తుమందు ఇచ్చి అటవీ ప్రాంతంలో లైంగికంగా వేధించారని ఆరోపించాడు.
ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్ల అమలు అంశంపై సుప్రీంకోర్టు రివ్యూ పిటిషన్ దాఖలైంది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆ తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ కాంగ్రెస్ నేత జయ ఠాకూర్ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు.
కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన అరుణ్ గోయల్ నియామక దస్త్రాలను తమ ముందు ఉంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. కేంద్రం హడావుడిగా ఆయనను ఈసీగా నియమించడంపై సర్వోన్నత న్యాయస్థానం సర్వోన్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది.
కర్ణాటకను కుదిపేసిన హిజాబ్ వివాదం ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌ను తాకింది. పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలోని ఒక పాఠశాలలో హిజాబ్, నామబలి(కాషాయ వస్త్రాలు) ధరించ రెండు గ్రూపుల విద్యార్థుల మధ్య జరిగిన గొడవ కారణంగా ప్రస్తుతం జరుగుతున్న పరీక్షలను రద్దు చేయాల్సి వచ్చింది.
అసోం-నాగాలాండ్ సరిహద్దులో అసోంలోని కర్బీ అంగ్లాంగ్ జిల్లాలోని బోకాజన్ సమీపంలోని లాహోరిజాన్ ప్రాంతంలో బుధవారం జరిగిన భారీ అగ్నిప్రమాదంలో పెద్ద సంఖ్యలో ఇళ్లు, దుకాణాలు దగ్ధమయ్యాయి.
2020లో శ్రద్ధా వాకర్ చేసిన ఫిర్యాదు ఆధారంగా తాము దర్యాప్తు ప్రారంభించామని, అయితే కేసును ఉపసంహరించుకోవాలని ఆమె వ్రాతపూర్వక ప్రకటన ఇవ్వడంతో కేసును మూసివేసినట్లు మహారాష్ట్ర పోలీసులు బుధవారం తెలిపారు. తనకు, అఫ్తాబ్ పూనావాలాకు మధ్య వివాదం పరిష్కరించబడిందని శ్రద్ధా వాకర్ కేసు వెనక్కి తీసుకుందని పోలీసులు వెల్లడించారు.
15 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడినందుకు గత ఏడాది అరెస్టయిన 22 ఏళ్ల యువకుడికి బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇద్దరు ప్రేమలో ఉన్నారని, ఆ అమ్మాయి మైనర్ అయినప్పటికీ పరిణామాలను అర్థం చేసుకోగలదని న్యాయస్థానం పేర్కొంది.
ఆగ్నేయ ఉక్రెయిన్‌లోని విల్నియాన్స్క్ నగరంలోని ప్రసూతి ఆసుపత్రిపై బుధవారం రష్యా క్షిపణి దాడిలో నవజాత శిశువు మరణించినట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. దాడి జరిగిన సమయంలో ప్రసవించిన మహిళ, శిశువు, డాక్టర్ రెండస్తుల భవనంలోని ప్రసూతి వార్డులో ఉందని.. ఆ వార్డు మొత్తం ధ్వంసమైందని అధికారులు వెల్లడించారు.