Joe Biden Birthday: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నవంబర్ 20న తన 80వ పుట్టినరోజును జరుపుకున్నారు. జో బైడెన్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన భార్య, అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్ ఆయనకు హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జో బైడెన్‌తో డ్యాన్స్ చేస్తూ ఉన్న రెండు ఫొటోలను ట్విట్టర్‌లో పంచకున్నారు.
ఆ ఫోటోలలో ఇద్దరూ ఈవెంట్‌లో డ్యాన్స్ చేస్తున్నారు. చిత్రాలకు జోడించిన క్యాప్షన్‌లో ఇలా ఉంది, “నేను మీతో కలిసి డ్యాన్స్ చేయడానికి ఇష్టపడే వారు మరొకరు లేరు. పుట్టినరోజు శుభాకాంక్షలు, జో! నేను నిన్ను ప్రేమిస్తున్నాను.” అంటూ జిల్ బైడెన్ ట్వీట్ చేశారు. అమెరికా అధ్యక్షుడు తన బర్త్‌డే వేడుకలను సన్నిహితులతో కలిసి ఘనంగా జరుపుకున్నారు. కుటుంబంతో కలిసి కేక్ కట్ చేసారు.
NASA: 2030కి ముందే మానవులు చంద్రునిపై మానవులు జీవించొచ్చు
పుట్టినరోజు వేడుకకు ఒక రోజు ముందు జో బైడెన్, ఆయన కుటుంబం మనవరాలైన నవోమి బైడెన్ వివాహాన్ని నిర్వహించారు. నూతన వధూవరులతో ఉన్న చిత్రాన్ని పంచుకుంటూ, ప్రథమ మహిళ, యూఎస్ ప్రెసిడెంట్ సంయుక్త పోస్ట్‌లో, “అభినందనలు నవోమి, పీటర్! మేము నిన్ను ప్రేమిస్తున్నాము.” అంటూ పోస్ట్ చేశారు. జిల్ బైడెన్ తన భర్త 80వ జన్మదినాన్ని పురస్కరించుకుని వింధు భోజనాన్ని కూడా ఏర్పాటు చేసింది.
There’s no one else I’d rather dance with than you.
Happy Birthday, Joe! I love you.💕 pic.twitter.com/7GmgE5vbqy
— Jill Biden (@FLOTUS) November 20, 2022