030కి ముందు మానవులు చంద్రునిపై జీవించి పని చేసే అవకాశం ఉందని నాసా అధికారి ఒకరు తెలిపారు.ఆర్టెమిస్ రాకెట్ విజయవంతంగా ప్రయోగించబడిన తర్వాత ఈ దశాబ్ధం ముగిసేలోపు మానవులు చంద్రునిపై నివసించవచ్చని నాసా అధికారి వెల్లడించారు.
ముందే ధరలు మండిపోతున్నాయి. నిత్యవసర వస్తువులు, కూరగాయలు, పాల ధరలు అమాంతంగా పెరిగిపోతున్నాయి. ధరల పెరుగుదలతో సామాన్యుడికి తీవ్ర భారంగా మారుతోంది. ప్రముఖ పాల ఉత్పత్తుల సంస్థ మదర్ డెయిరీ మళ్లీ పాల ధరలు పెంచేసింది. ఫుల్ క్రీమ్ లీటర్ పాలపై రూపాయి, టోకెన్ మిల్క్ లీటర్‌పై రూ.2 ధర పెంచుతున్నట్లు తెలిపింది.
ఒడిశాలోని జాజ్‌పూర్‌లోని కొరీ రైల్వే స్టేషన్ వద్ద గూడ్స్ రైలు వ్యాగన్లు పట్టాలు తప్పి ప్లాట్‌ఫాంపైకి దూసుకెళ్లడంతో ముగ్గురు వ్యక్తులు మరణించారు. సోమవారం ఉదయం 6.44 గంటలకు ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
పంది పిల్లల వ్యాపారంలో పెట్టుబడి పెట్టండి అంటూ ఓ కేటుగాడు.. రూ.వందల కోట్లకు కుచ్చుటోపీ పెట్టాడు. పంది పిల్లల వ్యాపారంలో పెట్టబడి పెట్టి 7 నెలల్లో 1.5 రెట్ల డబ్బును పొందండంటూ నమ్మబలికి పలువురిని మోసం చేశాడు.
జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ముగ్గురు సాయుధ హైబ్రిడ్ ఉగ్రవాదులను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. వారి వద్ద నుంచి 3 ఏకే 47 రైఫిల్స్, 2 పిస్టల్స్, 9 మ్యాగజైన్లు, 200 రౌండ్స్ తూటాలను స్వాధీనం చేసుకున్నారు.
అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ల అరాచకాలు కొనసాగుతున్నాయి. అధికారాన్ని దక్కించుకున్న తర్వాత మహిళలపై ఎన్నోఆంక్షలు విధిస్తూనే ఉన్నారు. ఇప్పటికే బాలికలు, మహిళలపై ఆంక్షలు విధిస్తోన్న తాలిబన్లు.. షరియానూ అమలు చేస్తున్నారు.
ఈజిప్టులో జరిగిన కాప్-27 వాతావరణ సదస్సులో కుదిరిన ఒప్పందాన్ని యూకే ప్రధాన మంత్రి రిషి సునాక్ ఆదివారం స్వాగతించారు. అయితే "చేయాల్సింది చాలా ఉంది" అని ఆయన పేర్కొన్నారు.