ఓటరుగా నమోదుపై యువతలో పేరుకుపోయిన నిర్లక్ష్యాన్ని తొలగించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాలేజీల్లో ప్రవేశాలను ఓటు హక్కుతో ముడిపెట్టాలని నిర్ణయించింది. మహారాష్ట్ర ప్రభుత్వం 18 ఏళ్లు పైబడిన విద్యార్థులు కాలేజీల్లో అడ్మిషన్ పొందేందుకు తమ ఓటరు నమోదును తప్పనిసరి చేస్తుందని రాష్ట్ర మంత్రి ఒకరు తెలిపారు.
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆర్టెమిస్-1 యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది.నాసా ఓరియన్ అంతరిక్ష నౌకను శుక్రవారం చంద్ర కక్ష్యలో ఉంచినట్లు అధికారులు తెలిపారు, చాలా ఆలస్యం అయిన మూన్ మిషన్ విజయవంతంగా కొనసాగుతోందని వెల్లడించారు.
రష్యా క్షిపణి దాడుల తర్వాత ఉక్రెయిన్‌లో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. ఎంతలా అంటే ఓ చిన్నారికి ఉక్రేనియన్ వైద్యులు చీకట్లో గుండె చికిత్స చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
చైనాలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 10 మంది మంటలకు ఆహుతి అయ్యారు. వాయువ్య చైనాలోని షింజియాంగ్‌లో ఓ అపార్ట్మెంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో 10 మంది మృతి చెందగా.. మరో తొమ్మిది మంది గాయపడ్డారు.
తీహార్ జైలులో సత్యేందర్ జైన్ మసాజ్ చేయించుకుంటున్న వీడియోను విడుదల చేసిన కొన్ని రోజుల తర్వాత, జైలులో ఉన్న ఢిల్లీ మంత్రి సెల్ లోపల జైలు అధికారి ఢిల్లీ మంత్రిని కలిసిన మరో వీడియోను బీజేపీ విడుదల చేసింది. సత్యేందర్ జైలు సందర్శన గంటల తర్వాత తీహార్ జైలు సూపరింటెండెంట్‌ని జైలు గదిలో కలిశారు.
నవంబర్ 26, 2008న ముంబయిలో జరిగిన ఉగ్రదాడితో భారతావనితో పాటు యావత్ ప్రపంచం వణికిపోయిన విషయం తెలిసిందే. భారత్‌తోపాటు మరో 14దేశాలకు చెందిన మొత్తం 166 మంది ప్రాణాలు కోల్పోయిన ఆ మారణహోమం జరిగి నేటికి 14ఏళ్లు అయ్యింది.
భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన చుక్కల మందు టీకా 'ఇన్‌కొవాక్'ను బూస్టర్ డోస్‌గా వినియోగించేందుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుత అనుమతి ప్రకారం ఇప్పటివరకు రెండు డోసుల కొవాగ్జిన్ లేదా కొవిషీల్డ్ టీకా తీసుకున్న వారు 6నెలల తర్వాత బూస్టర్ డోస్‌గా ఈ చుక్కల మందు టీకా తీసుకోవచ్చు.
వారిద్దరు ప్రేమకు హద్దులు లేవని మరోసారి నిరూపించారు. కర్ణాటకలోని హంపికి చెందిన అనంతరాజు, బెల్జియం దేశానికి చెందిన కెమిల్లెల విషయంలో ఈ మాట నిజమని మరోసారి రుజువైంది.
దక్షిణ ఉక్రేనియన్ నగరమైన ఖేర్సన్‌పై రష్యా బాంబు దాడుల్లో శుక్రవారం 15 మంది పౌరులు మరణించారని అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా ఇంజినీర్లు ప్రధాన నగరాలకు విద్యుత్, నీటి సరఫరాను పునరుద్ధరించడానికి ప్రయత్నించారు.