Agni -3 Missile: ఒడిశా తీరంలోని ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి బుధవారం ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణి అగ్ని-3 శిక్షణా ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. సాధారణ శిక్షణలో భాగంగా సైనిక దళాల్లోని వ్యూహాత్మక కమాండ్ ఈ ప్రయోగాన్ని నిర్వహించింది. క్షిపణికి సంబంధించి అన్ని అంశాలు, విశ్వసనీయతను ఈ పరీక్ష ధ్రువీకరించిందని అధికారులు చెప్పారు.
Costly Medicine: ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఔషధం ఇదే.. ధర రూ.28.6 కోట్లు
అగ్ని-3 భారత్ అభివృద్ధి చేసిన మధ్యంతర పరిధి బాలిస్టిక్ క్షిపణి. అగ్ని శ్రేణిలో వచ్చిన ఈ మూడవ క్షిపణికి 3,500 కి.మీ. – 5,000 కి.మీ. పరిధి ఉంది. పొరుగు దేశాల సరిహద్దుల నుండి బాగా దూరంలో గల లక్ష్యాలను ఇది ఛేదించగలదు. భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ అభివృద్ధి చేసిన అగ్ని-3, అణ్వస్త్రాలను ప్రయోగించే సామర్థ్యం కలిగిన రెండు దశల బాలిస్టిక్ క్షిపణి. డీఆర్‌డీవోకు చెందిన అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లాబొరేటరీలో అగ్ని-3 ని రూపొందించి, అభివృద్ధి చేశారు.