Leopard Attack: ఉత్తరాఖండ్‌లో అల్మోరాలోని రాణిఖేత్ తహసీల్‌లో చిరుతపులి దాడి చేయడంతో 58 ఏళ్ల వ్యక్తి మరణించాడు. చిరుతపులి తన ఇంటి దగ్గర నుంచి వృద్ధుడిని ఈడ్చుకెళ్లిన ఘటన దైన గ్రామంలో చోటుచేసుకుంది. మోహన్ రామ్ అనే వృద్ధుడు బుధవారం నుంచి కనిపించకుండా పోయినట్లు సమాచారం. ఆ తర్వాత వెతకగా.. ఈ ఉదయం అతని ఇంటికి 1 కి.మీ దూరంలో వ్యక్తి మృతదేహం లభ్యమైంది. రాణిఖేట్ జాయింట్ మేజిస్ట్రేట్ జై కిషన్, అల్మోరా డీఎఫ్‌వో మహంతి యాదవ్, తహసీల్దార్‌తో పాటు అటవీశాఖ బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది.
Single Use Plastic ban: నిషేధిత ప్లాస్టిక్ వాడితే భారీ జరిమానా.. ఉత్తర్వులు జారీ
గ్రామంలో చిరుతపులిని పట్టుకునేందుకు బోను ఏర్పాటు చేయాలని చాలా కాలంగా కోరుతున్నా అటవీశాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్తుల డిమాండ్ మేరకు డీఎఫ్‌ఓ బోను ఏర్పాటు చేయాలని ఆదేశించడంతో పాటు మృతుల బంధువులకు తక్షణ సాయంగా రూ.50 వేలు అందజేశారు.