Gurajada Award To Chaganti: ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుకు గురజాడ సాంస్కృతిక సమాఖ్య సభ్యులు గురజాడ విశిష్ట పురస్కారాన్ని అందజేశారు. గురజాడ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, కలెక్టర్ సూర్యకుమారి పాల్గొన్నారు. నవంబర్ 30న గురజాడ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు జేవీ సోమయాయులు, గొల్లపూడి మారుతి రావు, డా సి. నారాయణ రెడ్డి, కే. విశ్వనాథ్, గుమ్మడి, షావుకారు జానకి, మల్లెమాల, అంజలీ దేవి, సుద్దాల, యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్‌తో పాటు పలువురు ప్రముఖులకు గురజాడ విశిష్ట పురస్కార ప్రదానం చేశారు సభ్యులు.. ఈ ఏడాది ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వర రావు కు ఈ పురస్కారాన్నిప్రధానం చేయాలనుకున్నారు నిర్వాహకులు. అందుకు చాగంటి కూడా అంగీకరించి స్వీకరించారు. తొలుత చాగంటికి గురజాడ అవార్డు ఇవ్వాలనుకోవడంపైనే ప్రముఖ కవులు, కళాకారులు, రచయితలు మండిపడ్డారు. కానీ గురజాడ సాంస్కృతిక సమాఖ్య చాగంటికి పురస్కారం ఇవ్వడాన్ని గొప్పగా సమర్థించుకుంది.
గురజాగ అడుగుజాడలను అందరూ అనుసరించాలని విజయనగరం జిల్లా కలెక్టర్ ఏ.సూర్యకుమారి అన్నారు. గురజాడ అందరివారు.. ఏ ఒక్కరి వారు కాదని గుర్తించుకోవాలన్నారు. వివాదాలను గురజాడ వారికి అంటకట్టొద్దన్నది తన అభిప్రాయమన్నారు. జిల్లాలో ఇప్పటికే ఆడపిల్లల సంఖ్య తగ్గుతుందని.. మళ్లీ కన్యాశుల్కం వస్తుందేమో అన్న సందేహం కలుగుతుందన్నారు. ప్రతి ఏటా వివిధ రంగాలలో ప్రముఖులకు అవార్డులు ఇచ్చి సత్కరించడం సమాఖ్యకు గత ఇరవై ఏళ్లుగా వస్తుందని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. ఎలాంటి స్వలాభాన్ని చూడకుండా ప్రవచనాలను చాగంటి వారు అందిస్తున్నారన్నారు. అందుకే గురజాడ వారి పురస్కారం ఆయనకు అందించడం సముచితమన్నారు. చాగంటికి ఇవ్వడం విజయనగరం వాసులకు గొప్పవరంగా భావిస్తున్నామన్నారు.
Sandalwood Smuggling: పుష్ప సినిమాను తలపించిన పోలీసుల చేజింగ్.. భారీగా ఎర్రచందనం దుంగలు స్వాధీనం
దీనిని గురజాడ పురస్కారంగా భావించడం లేదని.. గురజాడ వారి ఆశీస్సులుగా తాను భావిస్తున్నానని.. అందుకే స్వీకరించడానికి సిద్ధపడ్డానని చాగంటి కోటేశ్వరరావు అన్నారు. గురజాడ వారు అంటే తనకు భక్తి, గౌరవమన్నారు. తన ప్రవచనాలలో కూడా గురజాడ పద్యాలను ప్రస్తావన చేశానన్నారు. తనకు ఇవ్వకూడదని ప్రకటించినా సంతోషించేవాడినని.. అలాగే ఎవ్వరికి ఇచ్చినా వచ్చి తిలకించేవాడినని చాగంటి అన్నారు.