ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ప్రతి ఏటా జరిగే జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానోత్సవం బుధవారం ఘనంగా జరిగింది. ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రతిష్టాత్మక అవార్డులను బహుకరించారు. క్రీడల్లో అత్యున్నత పురస్కారమైన ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డును టేబుల్ టెన్నిస్ లెజెండ్ అచంట శరత్ కమల్ అందుకోగా.. అర్జున అవార్డును 25 మంది క్రీడాకారులు స్వీకరించారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు సెటైరికల్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు చేపట్టిన కార్యక్రమానికి "ఇదేమీ ఖర్మ తెలుగు దేశానికి.." అనేది సరిగ్గా సరిపోతుందని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజల్లో స్పందన కరువైందని చంద్రబాబుకు అర్థం అయ్యిందన్నారు.
పెళ్లి మండపంలో పీటలపైనే వరుడు తనకు ముద్దు పెట్టాడని పెళ్లి చేసుకునేందుకు వధువు నిరాకరించింది. ఈ ఘటనతో పెళ్లికి వచ్చిన వారందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. మెడలో పూల మాల వేస్తున్న సమయంలో వరుడు.. వధువుకు ముద్దు పెట్టాడు. దీంతో వధువు ఆగ్రహానికి గురైంది.
తనను, లోకేష్‌ను చంపేస్తారట అంటూ మాట్లాడిన చంద్రబాబు మాటలకు రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కాటికి కాలు చాచిన చంద్రబాబును చంపే అవసరం ఎవరికీ లేదని ఆయన అన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే 150 హత్యలు జరిగాయని ఎమ్మెల్యే ఆరోపించారు.
పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని క్వెట్టాలో ఆత్మాహుతి పేలుడులో మృతుల సంఖ్య మూడుకు చేరుకుంది. పేలుడులో గాయపడిన మహిళ మరణించింది. 23 మంది పోలీసులతో సహా 27 మంది గాయపడినట్లు సమాచారం. గాయపడిన మహిళ చికిత్స పొందుతూ మృతి చెందిందని పోలీసులు మృతుల సంఖ్యకు సంబంధించిన అప్‌డేట్‌ను వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి జవహర్ రెడ్డి బాధ్యతలను స్వీకరించారు. డిసెంబర్ 1న బాధ్యతలు చేపట్టాల్సి ఉండగా.. నేడు ముహూర్తం బాగుండడంతో ఇవాళ స్వీకరించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు రోజుల వైఎస్సార్ కడప జిల్లా పర్యటన ఖరారైంది. డిసెంబర్ 2, 3 తేదీల్లో లింగాల, పులివెందుల, ఇడుపులపాయ ప్రాంతాల్లో పర్యటించనున్నారు.
పొరుగు రాష్ట్ర రాజకీయాలతో తమకు సంబంధం లేదని ఆంధ్రప్రదేశ్ పురపాలక , పట్టణాభివృద్ది శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాలరాసే కార్యక్రమాలు ఎక్కడ జరుగుతున్నా తాము విమర్శిస్తామన్నారు
ఏలూరు జిల్లా పెదవేగి మండలం విజయరాయిలో తెదేపా జాతీయాధ్యక్షుడు చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్యపై చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. "ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి.." కార్యక్రమం ప్రారంభిస్తామని టీడీపీ అంటే లండన్ బాబు దెందులూరులో హడావిడి చేశారన్నారు.
న్యూజిలాండ్, భారత జట్ల మధ్య జరుగుతున్న మూడో వన్డే వర్షం కారణంగా రద్దైంది. మూడు వన్డేల సిరీస్ న్యూజిలాండ్ 1-0 తేడాతో కైవసం చేసుకుంది. తొలి వన్డేను న్యూజిలాండ్ గెలుచుకోగా.. మిగిలిన రెండు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దు కావడం గమనార్హం.