బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి రిషి సునాక్ విదేశాంగ విధానంపై రిషి సునాక్ ప్రసంగించారు. ఇండో- పసిఫిక్ ప్రాంతంలో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంచుకునేందుకు కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. చైనాతో మాత్రం ఇందుకు విరుద్ధంగా పనిచేస్తామని తేల్చి చెప్పారు.
ఎంతోమందికి ఎన్నో వింత రుగ్మతలు ఉంటాయి. కొంతమంది మట్టి తింటారు. మరికొంత మంది చాక్‌పీసులు కరకర నమిలేస్తుంటూరు. ఇలాంటి వివిధ వింత రుగ్మతల వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. తాజాగా చైనాలోని షాన్స్‌కీ ప్రావిన్స్‌కు చెందిన ఓ 14 ఏళ్ల బాలిక కూడా ఓ విచిత్రమైన రుగ్మతతో ఆస్పత్రిలో చేరింది.
మోనోపోలీ గేమ్‌లో తీవ్ర వాగ్వాదం జరిగిన తర్వాత అమెరికాలో ఓ వ్యక్తి కుటుంబ సభ్యులపై కాల్పులకు తెగబడ్డాడు. మారణాయుధంతో దాడి చేసినందుకు అతడిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.
సహజీవనం చేస్తున్న ప్రియురాలిని పాశవికంగా హత్య చేసి 35 ముక్కలు చేసిన అఫ్తాబ్ పూనావాలాకు ఈ రోజు మళ్లీ పాలిగ్రాఫ్ పరీక్షలు చేయనున్నారు. ఢిల్లీ రోహిణిలోని ఫోరెన్సిక్ ల్యాబ్ సైన్సెస్ లాబొరేటరీలో ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
సరైన పత్రాలు లేకుండా శాటిలైట్ ఫోన్‌ను తీసుకెళ్లినందుకు రష్యా మాజీ మంత్రిని డెహ్రాడూన్ విమానాశ్రయంలో ఆదివారం సాయంత్రం అరెస్టు చేసినట్లు అధికారి ఒకరు తెలిపారు.
గ్యాంగ్‌స్టర్లు, ఉగ్రవాద ముఠాలకు మధ్య ఉన్న సంబంధాన్ని విచ్ఛిన్నం చేసేందుకు మంగళవారం ఎన్ఐఏ అధికారులు దాడులు జరిపారు. జాతీయ దర్యాప్తు సంస్థ మంగళవారం దేశంలోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది.
జార్ఖండ్‌లోని ధన్‌బాద్ జిల్లాలోని ఒక బ్లాక్‌లో ముస్లిం వివాహాలలో నృత్యం, సంగీతం, బాణసంచా కాల్చడాన్ని మతాధికారులు నిషేధించారు. డిసెంబర్ 2 నుంచి ఆంక్షలు ప్రారంభమవుతాయని నిర్సా బ్లాక్‌లోని సిబిలిబడి జామా మసీదు హెడ్ ఇమామ్ మౌలానా మసూద్ అక్తర్ సోమవారం తెలిపారు.
మంకీపాక్స్ వ్యాధికి ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) కొత్త పేరు పెట్టింది. అంతర్జాతీయ నిపుణులతో వరుసగా సంప్రదింపులు జరిపిన అనంతరం చివరకు ఈ పేరును ఖరారు చేసింది. ఇకపై మంకీపాక్స్‌ను 'ఎంపాక్స్' అని పిలవాలని ప్రపంచ దేశాలకు సిఫారసు చేసింది.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 1,621 మంది అభ్యర్థుల్లో 330 మంది అంటే దాదాపు 20 శాతం మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) సోమవారం వెల్లడించింది. అలాంటి 61 మంది అభ్యర్థులతో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అగ్రస్థానంలో ఉంది.
డ్రాగన్ దేశంలో జీరో కొవిడ్ విధానాన్ని కఠినంగా అమలు చేయడంపై మొదలైన ఆందోళనలు మరింత విస్తరిస్తున్నాయి. దేశంలోని బీజింగ్ సహా పలు నగరాల్లో ప్రజలు పెద్దఎత్తున నిరసనల్లో పాల్గొంటున్నారు. దేశమంతటా దాదాపు 40,000 కొత్త కొవిడ్ కేసులు నమోదవడంతో అధికారులు ఆంక్షలను కఠినతరం చేశారు.