Sidhu MooseWala Case: పంజాబీ గాయకుడి హత్యకు ప్రధాన సూత్రధారి అయిన కెనడాకు చెందిన గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్‌ను అరెస్టు చేయడానికి దారితీసే ఏదైనా సమాచారం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.2 కోట్ల రివార్డును ప్రకటించాలని గాయకుడు సిద్ధూ మూసేవాలా తండ్రి గురువారం డిమాండ్ చేశారు. ప్రభుత్వం పెద్ద మొత్తంలో ఇవ్వలేకపోతే తన జేబులో నుంచి పారితోషికం చెల్లించేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని బల్కౌర్ సింగ్ తెలిపారు. అమృత్‌సర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. నాలుగేళ్ల క్రితం ఓ మహిళను చంపి ఆ దేశం నుంచి పారిపోయిన భారతీయ సంతతికి చెందిన పౌరుడిని అరెస్టు చేసినందుకు ఆస్ట్రేలియా పోలీసులు 1 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లను రివార్డును ప్రకటించిన ఉదాహరణను ఉదహరించారు. గోల్డీ బ్రార్‌ను భారత్‌కు తీసుకువచ్చి అతని నేరాలకు గానూ చట్టపరంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.
మే 29న పంజాబ్‌లోని మాన్సా జిల్లాలో సిద్ధూ మూసేవాలాగా ప్రసిద్ధి చెందిన శుభదీప్ సింగ్ సిద్ధూ కాల్చి చంపబడ్డాడు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడు గోల్డీ బ్రార్ ఈ హత్యకు బాధ్యత వహించాడు.అప్పట్లో గాయకుడు రూ.2 కోట్లు పన్నుగా చెల్లించేవాడని సిద్ధూ మూసేవాలా తండ్రి పేర్కొన్నాడు, గ్యాంగ్‌స్టర్ అరెస్టుకు దారితీసే సమాచారం కోసం రివార్డ్ ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. అతన్ని పట్టుకోవడంలో సహాయం చేసిన వారికి రూ.2కోట్ల రివార్డు ఎందుకు ప్రకటించరని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అంత డబ్బు ప్రభుత్వం చెల్లించలేకపోతే తన భూమిని అమ్మి అయినా చెల్లిస్తానని ఆయన చెప్పారు.
TSPSC Group 4 Notification: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 9,168 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
విదేశాల్లోకి పారిపోయిన వ్యక్తిని అరెస్టు చేసి అదుపులోకి తీసుకునేందుకు వీలుగా గోల్డీ బ్రార్‌పై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసినట్లు పంజాబ్ పోలీసులు తెలిపారు. పంజాబ్‌లోని శ్రీ ముక్త్‌సర్ సాహిబ్‌కు చెందిన సతీందర్‌జీత్ సింగ్ అలియాస్ గోల్డీ బ్రార్, 2017లో స్టూడెంట్ వీసాపై కెనడాకు వెళ్లాడు. ఆ నిందితుడు లారెన్స్ బిష్ణోయ్ ముఠాలో చురుకైన సభ్యుడు. గత నెలలో డేరా సచ్చా సౌదా అనుచరుడి హత్యలో గోల్డీ బ్రార్ కూడా కీలక సూత్రధారి అని పోలీసులు తెలిపారు.
#SidhuMooseWala Father Balkaur today in Amritsar said Govt should announce a 2 crore reward on the gangster like Goldy Brar. If the Govt didn't have money to give the reward, I will give the reward by selling my land.#Punjabi #Punjab pic.twitter.com/EqBQriYLyw
— Akashdeep Thind (@thind_akashdeep) December 1, 2022