Shraddha Walker Case: అఫ్తాబ్ పూనావాలాకు నార్కో పరీక్ష పూర్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shraddha Walker Case: తన జీవిత భాగస్వామి శ్రద్ధా వాకర్‌ను దారుణంగా హత్య చేసిన కేసులో నిందితుడు అఫ్తాబ్ పూనావాలాకు నార్కో అనాలిసిస్ టెస్ట్ గురువారం ఢిల్లీలో రోహిణిలోని బాబా సాహెబ్ అంబేద్కర్ ఆసుపత్రిలో నిర్వహించారు. ఢిల్లీ పోలీసుల బందోబస్తు నడుమ ఈ పరీక్షను నిర్వహించారు. ఢిల్లీ కోర్టు విశ్లేషణకు అనుమతి ఇవ్వడంతో అఫ్తాబ్‌ను నార్కో పరీక్ష కోసం ఉదయం 9 గంటలకు తీహార్ జైలు నుంచి ఢిల్లీ పోలీసులు రోహిణిలో గల బాబా సాహెబ్ అంబేద్కర్ ఆసుపత్రికి తీసుకువచ్చారు.
నార్కో అనాలిసిస్ పరీక్ష చేసేముందు అఫ్తాబ్‌కు రక్తపోటు, పల్స్ రేటు, శరీర ఉష్ణోగ్రత, హృదయ స్పందనలను తనిఖీ చేసే సాధారణ పరీక్షలను నిర్వహించారు. అనంతరం అతను నార్కో పరీక్షకు అంగీకరిస్తూ సమ్మతి పత్రంపై సంతకం చేశాడు. ఆ తర్వాత అఫ్తాబ్‌కు అనస్థీషియా ఇచ్చారు. అనంతరం నార్కో పరీక్షను చేపట్టారు. ఫోటో నిపుణుడు, ఫోరెన్సిక్ సైకాలజీ నిపుణుడు, ఫోరెన్సిక్ మెడిసిన్ వైద్యుడు, నోడల్ ఆఫీసర్, నార్కో, అంబేద్కర్ హాస్పిటల్‌తో కూడిన ఎఫ్‌ఎస్‌ఎల్ అధికారుల బృందం నార్కో పరీక్షను నిర్వహించింది. అఫ్తాబ్ నార్కో పరీక్ష 11.45 గంటలకు ముగిసింది. ఆ తర్వాత అతను వైద్యుల పరిశీలనలో ఉంచబడడంతో పాటు అతనికి మానసిక చికిత్స అందించారు. అఫ్తాబ్‌కు పూర్తి స్పృహ వచ్చిన తర్వాత ఢిల్లీ పోలీసు బృందం అతడిని పూర్తి భద్రతతో తీహార్‌కు తీసుకెళ్లింది.
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
Drunk SI: తప్పతాగి పక్కింటికి వెళ్లిన ఎస్ఐ.. చెట్టుకు కట్టేసి కొట్టిన స్థానికులు
సోమవారం అఫ్తాబ్ ప్రయాణిస్తున్న పోలీసు వ్యాన్‌పై కొందరు కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్లు 365, 302, 201 కింద మెహ్రౌలీ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో నిందితుడైన అఫ్తాబ్ నార్కో పరీక్ష ఈ ఉదయం ప్రారంభమైందని ఐపీఎస్, స్పెషల్ సీపీ సాగర్ ప్రీత్ హుడా తెలిపారు. అంతకుముందు దేశ రాజధానిలోని ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ కార్యాలయంలో నిర్వహించిన పాలిగ్రాఫ్ పరీక్షలో.. ఈ ఏడాది మేలో శ్రద్ధాను చంపి, ఆమె శరీరాన్ని అనేక ముక్కలుగా నరికివేసినట్లు ఆఫ్తాబ్ అంగీకరించినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. తరిగిన శరీర భాగాలను రిఫ్రిజిరేటర్‌లో భద్రపరిచి క్రమంగా పారవేసినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి.నిందితుడు ప్రశ్నలకు తప్పుదోవ పట్టించే సమాధానాలు చెబుతున్నాడని ఢిల్లీ పోలీసులు సమర్పించిన తర్వాత ఆఫ్తాబ్‌పై పాలిగ్రాఫ్ పరీక్ష, నార్కో విశ్లేషణ నిర్వహించడానికి ఢిల్లీ కోర్టు పోలీసులను అనుమతించింది.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!