UN Security Council: డిసెంబర్ నెలలో 15 దేశాల ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి భ్రమణ అధ్యక్ష పదవిని భారతదేశం గురువారం స్వీకరించింది. ఈ సమయంలో ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంతో పలు ఈవెంట్‌లను భారత్ నిర్వహించనుంది. డిసెంబర్ 1 నుండి భద్రతా మండలి నెలవారీ రొటేటింగ్ అధ్యక్ష స్థానాన్ని భారతదేశం స్వీకరించింది. ఐక్యరాజ్యసమితిలో భారత్ తరఫున ఉన్న శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ అధ్యక్ష స్థానంలో కూర్చోనున్నారు. భారత్‌కు అధ్యక్షత స్థానం లభించే కొన్ని రోజుల ముందే రుచిరా కాంబోజ్ ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌తో పాటు.. జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు సిసాబా కొరోసీని కలుసుకున్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అధ్యక్ష సమయంలో ప్రాధాన్యతల గురించి చర్చించారు.
FIFA Fan Event: ఫిఫా ఈవెంట్‌లో రెపరెపలాడిన భారత జెండా.. నోరా డ్యాన్స్‌కు ఫిదా.. వీడియో వైరల్
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సభ్యునిగా ఎన్నుకోబడిన రెండేళ్ల పదవీకాలంలో భారత్ కౌన్సిల్‌కు అధ్యక్షత వహించే అవకాశం రావడం ఇది రెండోసారి. గతంలో 2021 ఆగస్టులో అవకాశం రాగా.. ప్రస్తుతం డిసెంబర్ 1 నుంచి ఈ అవకాశం లభించింది. మండలిలో భారతదేశం 2021-2022 పదవీకాలం డిసెంబర్ 31తో ముగుస్తుంది. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితికి భారతదేశపు మొదటి మహిళా శాశ్వత ప్రతినిధి కాంబోజ్ ఈ నెలలో భద్రతామండలి అధ్యక్షుడి స్థానంలో కూర్చోనున్నారు.