Pak vs Eng: పాకిస్థాన్‌తో టెస్ట్‌లో చరిత్ర సృష్టించిన ఇంగ్లీష్ జట్టు.. 112 ఏళ్ల రికార్డు బ్రేక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pak vs Eng: పాకిస్థాన్‌లోని రావల్పిండిలో ఇవాళ ప్రారంభమైన మొదటి టెస్టులో ఇంగ్లీష్ జట్టు చరిత్ర సృష్టించింది. టెస్టు మ్యాచ్ తొలిరోజే 500 పరుగులు చేసిన మొదటి జట్టుగా రికార్టు నెలకొల్పింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ జట్టు తొలి రోజే 4 వికెట్లు కోల్పోయి 506 పరుగుల స్కోర్ చేసి, క్రికెట్ చరిత్రలో తొలి రోజు అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా రికార్డుల్లోకెక్కింది. ఈ క్రమంలో 112 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది. ఆస్ట్రేలియా పేరిట 112 ఏళ్లుగా పదిలంగా ఉన్న ఈ రికార్డును ఇంగ్లండ్ నేడు బద్దలు కొట్టింది. 1910లో దక్షిణాఫ్రికాపై ఆసీస్ జట్టు తొలిరోజున 494 పరుగులు చేసింది. అయితే ఈ రికార్డును బెన్ స్టోక్స్ నాయకత్వంలోని ఇంగ్లండ్ జట్టు తెరమరుగు చేసింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో నేటి వరకు ఇదే తొలి రోజు అత్యధిక స్కోర్‌గా కొనసాగింది. తాజాగా ఇంగ్లండ్ తొలి రోజు అత్యధిక స్కోర్ చేసిన రికార్డుతో పాటు తొలి రోజు 500 పరుగుల సాధించిన తొలి జట్టుగానూ రికార్డు పుటల్లోకెక్కింది.
రావల్పిండిలో నేడు ప్రారంభమైన తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఇంగ్లండ్ టాపార్డర్ ఆటగాళ్లు ఆతిథ్య పాకిస్థాన్ బౌలర్లను చీల్చి చెండాడారు. వెలుతురు లేమి కారణంగా తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 75 ఓవర్లలో 4 వికెట్లకు 506 పరుగులు చేసింది. ఏకంగా నలుగురు బ్యాటర్లు శతకాలు బాదడం విశేషం. ఓపెనర్లు వచ్చిన జాక్ క్రాలే (122), బెన్ డకెట్ (107) తొలి వికెట్‌కు 233 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పగా.. అనంతరం వచ్చిన ఓలీ పోప్ (108) కూడా సెంచరీ సాధించారు. మాజీ కెప్టెన్ జో రూట్ 23 పరుగులకే ఔట్ కాగా.. తొలి రోజు ఆట చివర్లో వచ్చిన బ్యాటర్ హ్యారీ బ్రూక్ 101 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతడికి జోడీగా క్రీజులో కెప్టెన్ బెన్ స్టోక్స్ ఉన్నాడు. దూకుడుగా ఆడుతున్న స్టోక్స్ 15 బంతుల్లోనే 34 పరుగులు చేశాడు.
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
UN Security Council: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన భారత్
ఈ రికార్డుతో పాటు తొలి సెషన్‌లో అత్యధిక పరుగులు చేసిన జట్టుగానూ ఇంగ్లండ్ చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్ తొలి సెషన్‌లో 27 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 174 పరుగులు చేసిన ఇంగ్లండ్.. టీమిండియా పేరిట ఉన్న రికార్డును తిరగరాసింది. 2018లో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా తొలి సెషన్‌లో 158 పరుగులు స్కోర్ చేసింది. తాజాగా ఇంగ్లండ్.. ఈ రికార్డును కూడా బద్దలు కొట్టింది.
తాజావార్తలు
-
Primebook 3 Max: రూ.35,990కే కొత్త ల్యాప్‌టాప్.. 12 గంటల బ్యాటరీ, 8GB RAM, AI ఫీచర్లతో Primebook 3 Max
-
Aadarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
-
Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
-
Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
-
Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!