NVSS Prabhakar: ఢిల్లీ నూతన ఎక్సైజ్ పాలసీ.. తెలంగాణ విధానాన్ని అనుసరిస్తోంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NVSS Prabhakar: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో అట్టహసంగా దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టిందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ అన్నారు. దళితబంధు లబ్ధిదారుల ఎంపికలో ఎమ్మెల్యేలు వివక్ష, కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. లంచం ఇచ్చిన వాళ్లకే దళిత బంధు, రెండు పడక గదులను ఇస్తున్నారని మండిపడ్డారు. అధికార పార్టీకి చెందిన వ్యక్తులకే దళిత బంధు, డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తున్నారన్న ఆయన.. ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ సొమ్ములాగా వ్యవహరించడం రాజ్యాంగ ఉల్లంఘన కిందికి వస్తుందన్నారు. దళిత బంధు లబ్ధిదారుల ఎంపిక పర్యవేక్షణ కోసం హైకోర్టు చీఫ్ జస్టిస్ ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ కోరారు.
Rummy Lessons: పాఠ్యపుస్తకాల్లో రమ్మీ పాఠాలు.. విద్యాశాఖపై విమర్శల వర్షం
Also Read
- Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
- WI Vs Ind: ముగిసిన వెస్టిండీస్ బ్యాటింగ్.. భారత్ టార్గెట్ 172 పరుగులు..
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
- Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
డిల్లీ నూతన ఎక్సైజ్ విధానం.. తెలంగాణ విధానం ఒకటేనని ప్రభాకర్ ఆరోపించారు. ఢిల్లీ, తెలంగాణలో మద్యం సరఫరా చేసేది ఒక్కరేనని విమర్శించారు. తెలంగాణలో ఎనిమిదేళ్లలో మద్యం విధానాన్ని రెండు సార్లు సవరించడంతో పాటు విపరీతంగా ధరలు పెంచారని విమర్శలు గుప్పించారు. అర్ధాంతరంగా ఎక్సైజ్ శాఖ మంత్రిని తొలగించారని పేర్కొన్నారు. కవిత కనుసన్నల్లో ఉన్నే వ్యక్తికే ఎక్సైజ్ శాఖ మంత్రి పదవి కట్టబెట్టారన్నారు. తెలంగాణ ఎక్సైజ్ విధానం, మద్యం అమ్మకాలపైన సీబీఐ విచారణ జరపాలని ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
-
WI Vs Ind: ముగిసిన వెస్టిండీస్ బ్యాటింగ్.. భారత్ టార్గెట్ 172 పరుగులు..
-
Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
-
SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
-
Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!