Himanta Biswa Sarma: అస్సాం ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత హిమంత బిశ్వ శర్మ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై మాటల దాడిని రెట్టింపు చేశారు. రాహుల్ గాంధీ తన గడ్డంతో సద్దాం హుస్సేన్ లాగా కనిపిస్తున్నాడని గతంలో చేసిన వ్యాఖ్యను మరో సారి సమర్థించుకున్నారు. తాను రాహుల్ సద్దాం హుస్సేన్‌లా మాత్రమే కనిపిస్తున్నాడని చెప్పానని.. ఇంకేమీ చెప్పలేదని మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. తాను మతం గురించి పోల్చలేదని హిమంత బిశ్వ శర్మ తెలిపారు.
Two Tigers: తడోబా అంధారి రిజర్వ్‌లో 24 గంటల్లో 2 పులులు మృతి
తాను కాంగ్రెస్‌ను విడిచిపెట్టి బీజేపీలోకి వచ్చినప్పుడు సైద్ధాంతిక మార్పు ఏమీ లేదని.. కాంగ్రెస్‌లో 22 ఏళ్ల జీవితాన్ని వృథా చేసుకున్నట్లు ఆయన నొక్కి చెప్పారు. ‘కాంగ్రెస్‌లో తాము కుటుంబాన్ని పూజించేవాళ్లం.. బీజేపీలో దేశాన్ని పూజిస్తాం’ అని మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. ఒకప్పుడు అస్సాంలో కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రిగా ఉన్న ఆయన 2015లో నిష్క్రమించారు. ఆ తర్వాత బీజేపీలో చేరిన ఆయన మంత్రిగా సేవలందించారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఇరాక్ మాజీ నియంత సద్దాం హుస్సేన్ లాగా కనిపిస్తున్నారని.. ఆయన సర్దార్ వల్లభాయి పటేల్, జవహర్‌లాల్ నెహ్రూ లేదా మహాత్మా గాంధీలా తన రూపాన్ని మార్చుకుని ఉంటే బాగుండేదని శర్మ గత నెలలో అన్నారు. లవ్ జిహాద్‌ను విస్మరించడం బుజ్జగింపు రాజకీయంగా భావించానని హిమంత బిశ్వ శర్మ అన్నారు.