ఝలావర్‌లో జరిగిన భారత్ జోడో యాత్ర కార్యక్రమంలో ఇద్దరు కాంగ్రెస్ నేతలు వేదికపై రాహుల్ గాంధీతో కలిసి గిరిజన నృత్యంలో పాల్గొనడానికి చేతులు జోడించి నృత్యం చేశారు. ఒకే వేదికపై సీనియర్ నేతలైన రాహుల్ గాంధీ ,అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్, కమల్ నాథ్‌లు స్టెప్పులు వేయడం గమనార్హం.
మధ్యప్రదేశ్‌లోని రత్లామ్‌లో విషాదం చోటుచేసుకుంది. ఆదివారం సాయంత్రం మధ్యప్రదేశ్‌లోని రత్లామ్‌లో రోడ్డు పక్కన బస్టాప్ వద్ద నిలబడి ఉన్న జనాలపైకి ప్రమాదవశాత్తు ఓ ట్రక్కు వేగంగా దూసుకెళ్లడంతో ఆరుగురు వ్యక్తులు మృతి చెందారు.
ఆరు నెలల స్పేస్ మిషన్ తర్వాత ముగ్గురు చైనీస్ వ్యోమగాములు సురక్షితంగా తిరిగి వచ్చారు. ముగ్గురు వ్యోమగాములు స్పేస్ స్టేషన్ కాంప్లెక్స్‌లో 183 రోజులు పనిచేశారు.
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లాలోని మహాకాళేశ్వర్ ఆలయ ప్రాంగణంలో ఇద్దరు మహిళలు నృత్యం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బాలీవుడ్ పాటలకు డ్యాన్స్ చేస్తూ వీడియోలో కనిపిస్తున్న ఈ మహిళలు ఆలయం వద్ద భద్రతా బృందంలో ఉన్నారు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఈ నేపథ్యంలో గుజరాత్‌లోని గాంధీనగర్‌లో తన తల్లి హీరాబెన్ మోడీని ప్రధాని కలిశారు. గుజరాత్ రెండో దశ ఎన్నికల నేపథ్యంలో తన తల్లి ఆశీర్వాదాలను తీసుకున్నారు.
రెండు నెలలకు పైగా నిరసనల తర్వాత ఎట్టకేలకు ఇరాన్ ప్రభుత్వం దిగొచ్చింది. దేశంలోని కఠినమైన మహిళా దుస్తుల కోడ్‌ను ఉల్లంఘించారనే ఆరోపణలపై మహ్సా అమిని అరెస్టు చేయడం వల్ల రెండు నెలలకు పైగా నిరసనలు జరిగాయి. మహ్సా అమిని మృతికి కారణమైందని నైతికత పోలీసు విభాగాలను రద్దు చేసింది.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కొద్ది రోజులుగా అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా మాస్కోలోని తన అధికారిక నివాసంలో మెట్లపై నుంచి జారి పడిపోయారని అంతర్జాతీయ మీడియాలు పేర్కొన్నాయి.
హిమాచల్ ప్రదేశ్‌లో కానిస్టేబుల్ పరీక్ష పేపర్ లీక్‌పై సీబీఐ విచారణ చేపట్టింది. కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్షకు సంబంధించిన పేపర్ లీక్ విషయాలు వెలుగులోకి వచ్చిన అనంతరం రాష్ట్ర పోలీసు ప్రత్యేక దర్యాప్తు బృందం నుంచి సీబీఐ కేసును స్వీకరించింది.
గత నెలలో ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులతో జరిగిన ఎన్‌కౌంటర్ తర్వాత భద్రతా దళాలు అమెరికాలో తయారు చేసిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నాయని పోలీసులు ఆదివారం తెలిపారు. నవంబర్ 26న మిర్టూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పొమ్రా అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులను భద్రతా బలగాలు హతమార్చాయని ఒక అధికారి తెలిపారు.