Astronauts Return Safely After 6 Months: ఆరు నెలల స్పేస్ మిషన్ తర్వాత ముగ్గురు చైనీస్ వ్యోమగాములు సురక్షితంగా తిరిగి వచ్చారు. ముగ్గురు వ్యోమగాములు స్పేస్ స్టేషన్ కాంప్లెక్స్‌లో 183 రోజులు పనిచేశారు. కక్ష్యలో ఉన్న అంతరిక్ష కేంద్రానికి ముగ్గురు వ్యోమగాములను మోసుకెళ్లిన చైనా అంతరిక్ష నౌక షెన్‌జౌ-14 ఆదివారం ఉత్తర ఇన్నర్ మంగోలియా అటానమస్ రీజియన్‌లోని డాంగ్‌ఫెంగ్ ల్యాండింగ్ సైట్‌లో సురక్షితంగా ల్యాండ్ అయింది. అంతరిక్ష నౌక ల్యాండ్ అయిన కొన్ని నిమిషాల తర్వాత ముగ్గురు వ్యోమగాములు చెన్ డాంగ్, లియు యాంగ్, కై జుజే ఒకరి తర్వాత ఒకరు బయటకు వచ్చారు. మంచి శారీరక స్థితిలో ఉన్న ముగ్గురు వ్యోమగాములు ఆరోగ్య తనిఖీల కోసం ప్రధాన కార్యాలయానికి తీసుకెళ్లే ముందు ప్రభుత్వ టెలివిజన్ రిపోర్టర్‌లతో కొద్దిసేపు మాట్లాడారు. అంతకుముందు ముగ్గురిని మోసుకెళ్లిన షెంజో-14 అంతరిక్ష కేంద్రం నుండి విడిపోయింది. వారి స్థానంలో మరో ముగ్గురు వ్యోమగాములు నవంబర్ 29న షెన్‌జౌ-15 స్పేస్‌షిప్ ద్వారా నిర్మాణంలో ఉన్న స్పేస్ స్టేషన్‌కు పంపబడ్డారు.
అంతరిక్ష కేంద్రం నుంచి వచ్చిన ముగ్గురు షెన్‌జౌ-14 వ్యోమగాములను జూన్ 5న అంతరిక్ష కేంద్రానికి పంపారు. వారు గత కొన్ని నెలలుగా డాకింగ్‌లను పర్యవేక్షించడం, మూడు ఎక్స్‌ట్రావెహిక్యులర్ కార్యకలాపాలు నిర్వహించడం, ఒక లైవ్ సైన్స్ లెక్చర్ ఇవ్వడం, నిర్వహించడం వంటి అనేక పనులను పూర్తి చేశారు. అమెరికాతో పోటీ పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఏడాది చివరి నాటికి అంతరిక్ష కేంద్రాన్ని పూర్తి చేయాలని చైనా యోచిస్తోంది.
Mahakal Temple: ఆలయంలోనే మహిళా భద్రతా సిబ్బంది చిందులు.. వీడియో వైరల్ కావడంతో!
షెంజౌ-15 అంతరిక్ష నౌక ఫీ జున్‌లాంగ్, డెంగ్ క్వింగ్మింగ్, జాంగ్ అనే ముగ్గురు వ్యోమగాములను మోసుకెళ్లింది. వారి ఆరు నెలల మిషన్ సమయంలో, షెన్‌జౌ-15 సిబ్బంది చైనా అంతరిక్ష కేంద్రంలో దాని మూడు-మాడ్యూల్ కాన్ఫిగరేషన్‌లో దీర్ఘకాలిక నివాసానికి సంబంధించిన పరీక్షలను నిర్వహిస్తారని సీఎంఎస్‌ఏ అసిస్టెంట్ డైరెక్టర్ జి క్విమింగ్ చెప్పారు. చైనా అంతరిక్ష కేంద్రం నిర్మాణ దశలో ఇదే చివరి ఫ్లైట్ మిషన్ అని అధికారిక మీడియా తెలిపింది. లాంగ్ మార్చ్-2ఎఫ్ క్యారియర్ రాకెట్‌తో ఈ ప్రయోగం జరిగింది. ఇదంతా సిద్ధమైతే, అంతరిక్ష కేంద్రాన్ని కలిగి ఉన్న ఏకైక దేశం చైనా అవుతుంది. రష్యా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం అనేక దేశాల సహకార ప్రాజెక్టుగా ఉంది. చైనా స్పేస్ స్టేషన్ కూడా రష్యా నిర్మించిన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పోటీగా ఉంటుందని భావిస్తున్నారు.