PM Narendra Modi: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఈ నేపథ్యంలో గుజరాత్‌లోని గాంధీనగర్‌లో తన తల్లి హీరాబెన్ మోడీని ప్రధాని కలిశారు. గుజరాత్ రెండో దశ ఎన్నికల నేపథ్యంలో తన తల్లి ఆశీర్వాదాలను తీసుకున్నారు. ఈ సంవత్సరం జూన్‌లో కూడా 99 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని తన తల్లి ఆశీర్వాదం కోరారు. తల్లితో కాసేపు ప్రధాని ముచ్చటించారు. తల్లి హీరాబెన్ పక్కన కూర్చుని టీని ఆస్వాదించారు. రేపు ఉదయం 8.30 గంటలకు అహ్మదాబాద్‌లో ప్రధాని మోడీ ఓటు వేయనున్నారు. హీరాబెన్ మోడీ గాంధీనగర్ శివార్లలోని రైసన్ గ్రామంలో ప్రధాని తమ్ముడు పంకజ్ మోదీతో కలిసి నివసిస్తున్న సంగతి తెలిసిందే. ప్రధాని మోడీ చివరిసారిగా జూన్‌లో తన తల్లి పుట్టినరోజు సందర్భంగా ఆమెను కలుసుకున్నారు.
#WATCH | Gujarat: Prime Minister Narendra Modi meets his mother Heeraben Modi at her residence, in Gandhinagar. pic.twitter.com/C4uh1CMOFb
— ANI (@ANI) December 4, 2022
Gujarat | Prime Minister Narendra Modi meets his mother Heeraben Modi at her residence, in Gandhinagar. pic.twitter.com/3Rtg3gJ3ON
— ANI (@ANI) December 4, 2022
డిసెంబర్ 5న పోలింగ్ జరగనున్న 93 నియోజకవర్గాల్లో 833 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. రెండో దశలో ఉత్తర, మధ్య గుజరాత్‌లోని 14 జిల్లాల్లో ఉన్న స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో ప్రధానంగా వదోదరా, అహ్మదాబాద్, గాంధీనగర్ తదితర నగరాలు కూడా ఉన్నాయి. ఈ 93 స్థానాల్లో మొత్తం 2.54 కోట్ల మంది ఓటర్లున్నారు. 26,409 బూత్‌లలో పోలింగ్ జరగనుంది, దాదాపు 36,000 ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను వినియోగించనున్నారు. ఎన్నికల సంఘం 14 జిల్లాల్లో 29,000 మంది ప్రిసైడింగ్ అధికారులను, 84,000 మంది పోలింగ్ అధికారులను మోహరించనున్నట్లు అధికారిక ప్రకటనలో తెలిపారు.
Vladimir Putin: ఇంట్లో మెట్లపై నుంచి పడిపోయిన పుతిన్
ఈ దశలో పలువురు ప్రముఖులు బరిలో ఉన్నారు. రెండో దశలో ఘట్లోడియా నుంచి ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, విరామ్‌గామ్ నుంచి పాటిదార్ నాయకుడు హార్దిక్ పటేల్, గాంధీనగర్ సౌత్ నుంచి ఓబీసీ నాయకుడు అల్పేష్ ఠాకోర్ ప్రముఖ అభ్యర్థులు. హార్దిక్ పటేల్, ఠాకూర్ ఇద్దరూ బీజేపీ టికెట్‌పై పోటీ చేస్తున్నారు. రెండో దశలో ఎన్నికలు జరుగుతున్న స్థానాల్లో డిసెంబర్ 1, 2 తేదీల్లో ప్రధాని నరేంద్ర మోడీ సుడిగాలి ప్రచారం జరిపారు. మోడీతో పాటు బీజేపీ తరఫున సీనియర్ నేతలు అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్‌నాథ్ సింగ్.. కాంగ్రెస్ తరఫున ఆ పార్టీ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గే.. ఆప్ తరఫున ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రచారం నిర్వహించారు.