హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజారిటీ మార్క్‌ను దాటింది. 68 మంది సభ్యులు గల హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ కాంగ్రెస్ 39 స్థానాల్లో విజయాన్ని ఖరారు చేసింది. 26 స్థానాల్లో బీజేపీ గెలవనుంది. ఈ నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ ఓటమిని అంగీకరించారు.
గుజరాత్ అసెంబ్లీలో కేవలం 16 సీట్లను మాత్రమే గెలుచుకోగలిగిన కాంగ్రెస్ పార్టీకి మరోదెబ్బ తగిలింది. గుజరాత్‌లో ప్రతిపక్ష పార్టీ హోదా కూడా దక్కించుకోలేని స్థితిలో పడిపోయింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన మాండస్ తుఫాను రోజురోజుకూ మరింత బలంగా దూసుకొస్తోంది. దీనిపై వాతావరణ అధికారులు వేస్తున్న అంచనాలు మాటిమాటికీ మారిపోతున్నాయి. నిన్న తీరం దాటుతుందని అంచనా వేయగా.. తాజాగా ఈ లెక్క మారింది. ప్రస్తుతం ఉత్తర తమిళనాడుకి దగ్గరలో ఉన్న ఈ తుఫాను.. శనివారం ఉదయం శ్రీహరికోట - పుదుచ్చేరి మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నేడు జరుగుతున్న ఓట్ల లెక్కింపులో బీజేపీకి స్పష్టమైన ఆధిక్యం దక్కడానికి పార్టీ ఇప్పటివరకు చేసిన పనులే కారణమని బీజేపీ వీరంగామ్ అభ్యర్థి, పాటిదార్ నాయకుడు హార్దిక్ పటేల్ అన్నారు. జమ్మూ కశ్మీర్‌లో 2019లో ఆర్టికల్ 370 రద్దును కూడా ఆయన హైలైట్ చేశారు.
లోక్‌దళ్ రాష్ట్రంలోని మూడు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. మెయిన్‌పురి లోక్‌సభ స్థానం నుంచి సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ భార్య, లోక్‌సభ మాజీ ఎంపీ డింపుల్ యాదవ్ లక్ష ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ప్రస్తుత ఎంపీ, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ మరణానంతరం ఇక్కడ ఎన్నికలు జరిగాయి.
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ మెజారిటీ స్థానాల్లో ఆధిక్యం సాధించి తన మార్క్‌ను చాటుకుంది. ఈ నేపథ్యంలో బీజేపీ 15 ఏళ్ల పాలనకు తెరదించుతూ స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించింది
అదనపు ఫీచర్లతో కూడిన సుప్రీంకోర్టు మొబైల్ యాప్ 2.0 సిద్ధంగా ఉందని.. న్యాయ అధికారులు, ప్రభుత్వ విభాగాలు తమ కేసులను ట్రాక్ చేయడానికి వీలు కల్పిస్తుందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ బుధవారం ప్రకటించారు.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పెద్ద కుమారుడు ఉదయనిధి వచ్చేవారం కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. తమిళ రాజకీయాల్లో తనదైన ముద్ర కనబర్చిన యువ నాయకుడిగా ఉదయనిధి స్టాలిన్ గుర్తింపు పొందారు.
తీవ్ర నిరసనల అనంతరం కొవిడ్ నియంత్రణలను సడలిస్తున్నట్లు చైనా అధికారికంగా ప్రకటించింది. పాజిటివ్ కొవిడ్ కేసులు ఇప్పుడు ఇంట్లోనే క్వారంటైన్ చేసుకోవచ్చు. చైనా బుధవారం కొవిడ్ పరిమితులను సడలిస్తున్నట్లు ప్రకటించింది.
తూర్పు ఢిల్లీలో అదృశ్యమైన మూడేళ బాలుడి మృతదేహాన్ని మంగళవారం ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బాలుడిని నవంబర్ 30న ప్రీత్ విహార్‌లోని అతని నివాసం నుండి కిడ్నాప్ చేసి.. యూపీలో హత్య చేశారు.