పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. రాజ్యసభ ఛైర్మన్‌గా తొలిసారి బాధ్యతలు చేపట్టిన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కడ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. కౌంటింగ్ ప్రారంభంలోనే ఆప్, బీజేపీల మధ్య ప్రారంభ పోకడలు నిమిష నిమిషానికి మారుతున్నాయి. ఈ రెండు పార్టీల మధ్య గట్టి పోటీ ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు.
రష్యా- ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం పదో నెలలోకి ప్రవేశించింది. పది నెలలు అవుతున్నా ఆ రెండు దేశాలు ఇప్పటికీ వెనక్కి తగ్గడం లేదు. ఆ యుద్ధం కారణంగా ప్రపంచ ఆహార భద్రత క్షీణించడం పట్ల ఆందోళన చెందుతున్నట్లు భారతదేశం మంగళవారం తెలిపింది.
మహారాష్ట్రలోని 11 గ్రామాలు ప్రాథమిక సౌకర్యాలపై కర్ణాటకలో విలీనాన్ని కోరుతున్నాయి. తమ ప్రాంతాల్లో సరైన రోడ్లు, విద్యుత్, మంచినీటి వసతి లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తార్ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్‌లో పోర్చుగల్ గోల్స్‌తో స్విస్ జట్టును చిత్తు చేసింది. రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లో పోర్చుగల్ 6-1 గోల్స్ తేడాతో స్విట్జర్లాండ్‌ను ఓడించగా, గొంకలో రామోస్ హ్యాట్రిక్ సాధించగా, పెపే, రాఫెల్ గెరిరో, రాఫెల్ లియో ఒక్కో గోల్ చేశారు.
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్-బంగ్లాదేశ్ మధ్య రెండో మ్యాచ్ నేడు ఢాకా వేదికగా జరగనుంది. తొలి వన్డేలో ఒక వికెట్ తేడాతో గెలిపొందిన ఆతిథ్య బంగ్లాదేశ్ సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది. చావో రేవో తేల్చుకోవాల్సిన పోరులో ఎలాగైనా నెగ్గి మూడో మ్యాచ్‌ను నిర్ణయాత్మకంగా మార్చాలని భారత్ కోరుకుంటోంది.
లండన్‌లోని యార్క్ నగరాన్ని సందర్శించిన కింగ్ చార్లెస్ III, క్వీన్ కన్సార్ట్ కెమిల్లాపై దుండగులు కోడిగుడ్లు విసిరారు. ఈ ఘటనలో ఒక వ్యక్తిని బుధవారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేడు జరగనుంది. సాధారణ ఎన్నికలను తలపిస్తూ దేశ రాజధానిలో జరిగిన ఎన్నికల్లో ఆప్, బీజేపీల మధ్య ఉత్కంఠ భరిత వాతావరణంలో డిసెంబర్ 4న ఈ ఎన్నిక జరిగింది. నేడు ఈ ఎన్నికకు సంబంధించి ఫలితాలు కూడా వెలువడనున్నాయి.
పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం మీడియాతో సంభాషించే అవకాశం ఉందని లోక్‌సభ సెక్రటేరియట్ మంగళవారం తెలిపింది. పార్లమెంట్ సెషన్స్ బుధవారం ప్రారంభమై డిసెంబర్ 29 వరకు కొనసాగనున్నాయి.
ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ ఎన్నికల పోలింగ్ సోమవారం జరగనుంది. రెండో దశలో ఉత్తర, మధ్య గుజరాత్‌లోని 14 జిల్లాల్లో ఉన్న స్థానాలకు ఎన్నికలు జరుగనుండగా.. ఏర్పాట్లన్ని పూర్తయ్యాయి.