Vladimir Putin: ఇంట్లో మెట్లపై నుంచి పడిపోయిన పుతిన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vladimir Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కొద్ది రోజులుగా అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా మాస్కోలోని తన అధికారిక నివాసంలో మెట్లపై నుంచి జారి పడిపోయారని అంతర్జాతీయ మీడియాలు పేర్కొన్నాయి. 70 ఏళ్ల పుతిన్ మెట్లపై నుంచి పడిపోవడంతో స్వల్ప గాయాలైనట్లు సమాచారం. ఆయన బాడీగార్డ్స్ సోఫాలో కూర్చోబెట్టగా వైద్యులు చికిత్స అందించినట్లు తెలుస్తోంది. ప్రపంచ దేశాల అధినేతల్లో బలమైన నేతగా వెలుగొందుతున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన అధికారిక నివాసంలో మెట్లపై నుంచి పడిపోయినట్లు జనరల్ ఎస్‌వీఆర్ అనే రష్యన్ టెలిగ్రామ్ ఛానల్ పేర్కొంది. వాస్తవానికి ఈ ఛానల్ పుతిన్‌పై తరుచూ విమర్శలు గుప్పిస్తూ ఉంటుంది. ఆయన అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని, ఆ విషయాన్ని క్రెమ్లిన్ బయటపెట్టడం లేదని నిరంతరం చెప్తూ ఉంటుంది.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అనారోగ్య సమస్యలతో సమతమతవుతున్నట్లు వెల్లడిస్తూ వస్తున్న జనరల్ ఎస్‌వీఆర్ తాజా పరిణామం గురించి వెల్లడించింది. అయితే, ఈ విషయంపై క్రెమ్లిన్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోవైపు.. మెట్లపై నుంచి పడిపోవడం వల్ల తుంటి ఎముక దెబ్బతినంటతో పాటు జీర్ణాశయాంతర క్యాన్సర్ బయటపడిందని మీడియా పేర్కొంది. ‘సమీపంలోని సోఫాలోకి తీసుకెళ్లేందుకు ముగ్గురు సెక్యూరిటీ అధికారులు పుతిన్‌కు సాయం చేశారు. అధికారిక నివాసంలో విధులు నిర్వర్తిస్తున్న వైద్యులను పిలిపించారు. పుతిన్ ఇప్పటికే జీర్ణాశయాంతర పేగు ఆంకాలజీతో బాధపడుతున్నారు. దాని ఫలితంగా ఆయన ఇప్పటికే జీర్ణక్రియ సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఆ కారణంగానే మెట్లపై నుంచి పడిపోయారు.’ అని స్థానిక మీడియా పేర్కొంది.
Also Read
- Bhindi Health Benefits: బెండకాయ జిగురును చూసి దూరం పెడుతున్నారా? ప్రయోజనాలు తెలిస్తే షాకే..!
- Telangana Bar Licences Draw : లక్కీ డ్రాలో లక్ ఎవరికో?.. రాష్ట్రంలో బార్ల కేటాయింపునకు సర్వం సిద్ధం..
- EPFO ECR Filing Deadline: వేతన పరిమితి మార్పులతో ECR ఫైలింగ్‌లో మార్పులు.. EPFO కీలక నిర్ణయం
- Nepal: చైనాను కాదని, భారత్‌కే ఓటేసిన నేపాల్ ప్రధాని..
Constable Exam Paper Leak: కానిస్టేబుల్ పరీక్ష పేపర్ లీక్.. విచారణ చేపట్టిన సీబీఐ
గాయం కారణంగా పుతిన్ బాత్‌రూంకు కూడా ఒంటరిగా వెళ్లలేకపోయారని టెలిగ్రామ్ ఛానల్ పేర్కొంది. పుతిన్ మెట్లపై నుంచి పడిపోయిన క్రమంలో ఆయన ఆరోగ్యంపై మరోమారు వార్తలు గుప్పుమన్నాయి. దీర్ఘకాలిక ఒత్తిడి, దగ్గు, మైకము, నిద్రలేమి, కడుపు నొప్పి వంటి సమస్యలతో బాధపడుతున్నారని పలు మీడియాలు కథనాలు వెల్లడించాయి. పుతిన్ తన చుట్టూ క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్లు నిత్యం ఉండేలా జాగ్రత్త పడుతున్నారని గతంలోనూ పలు మీడియాలు పేర్కొన్నాయి.
తాజావార్తలు
-
Telangana Inter Exam Fee : తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల..
-
Kim Jong Un: కిమ్ కొత్త క్షిపణి ప్రయోగం.. దడదడలాడిన దక్షిణ కొరియా!
-
iPhone Duo Repair Cost: రూ.3 లక్షల iPhone Duo.. స్క్రీన్ రిపేర్‌కే రూ.1.49 లక్షలు! రిపేర్ ధరల పూర్తి జాబితా ఇదే
-
January 12 Vidudala నుంచి ఫస్ట్ సింగిల్ రెడీ! అనిల్ రావిపూడి ప్లాన్ ఇదేనా?
-
Bhindi Health Benefits: బెండకాయ జిగురును చూసి దూరం పెడుతున్నారా? ప్రయోజనాలు తెలిస్తే షాకే..!
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!