US-Made Weapon: గత నెలలో ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులతో జరిగిన ఎన్‌కౌంటర్ తర్వాత భద్రతా దళాలు అమెరికాలో తయారు చేసిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నాయని పోలీసులు ఆదివారం తెలిపారు. నవంబర్ 26న మిర్టూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పొమ్రా అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులను భద్రతా బలగాలు హతమార్చాయని ఒక అధికారి తెలిపారు. దాదాపు 40 నిమిషాల పాటు జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు డివిజనల్ కమిటీ సభ్యుడు మోహన్ కడ్తి(40), మట్వారా ఎల్‌వోఎస్ సభ్యుడు రమేష్(32), మహిళా మావోయిస్టు నేత సుమిత్ర(28), మరో మహిళా మవోయిస్టు మృతి చెందారు. ఈ ఆపరేషన్‌లో కనీసం నాలుగు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాయని, అందులో ఒకటి అమెరికాలో తయారు చేసిన ఎం1 కార్బైన్ అని ఆయన చెప్పారు. ఇతర అసాల్ట్ రైఫిల్స్‌తో పోలిస్తే విదేశీ నిర్మిత ఆయుధం బారెల్ చిన్నదని, దానిని నిర్వహించడానికి సౌకర్యవంతంగా ఉంటుందని అధికారి తెలిపారు.
Rice Farming: సఫలమైన సరికొత్త వరి వంగడం.. ఒకసారి నాట్లు వేస్తే 8 పంటలు
స్వాధీనం చేసుకున్న తుపాకీ సీరియల్ నంబర్ ప్రకారం, మావోయిస్టులు ఇంత అత్యాధునిక ఆయుధాన్ని ఎలా, ఎక్కడి నుండి సంపాదించారనే దానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారని ఆయన చెప్పారు. ఈ తుపాకిని అమెరికా సైన్యం రెండో ప్రపంచ యుద్ధం, వియత్నాం యుద్ధం, కొరియన్ యుద్ధంలో ఉపయోగించింది. ఇలా విదేశాల్లో తయారైన అధునాతన ఆయుధాలు పట్టుబడడం కొత్తేమీ కాదు. అంతకుముందు డిసెంబర్ 2011, ఏప్రిల్ 2014లో, కాంకేర్ జిల్లాలోని రౌఘాట్, భానుప్రతాప్‌పూర్ ప్రాంతాల్లో మావోయిస్టులతో ఎన్‌కౌంటర్ తర్వాత ‘మేడ్ ఇన్ యూఎస్‌ఏ’ గుర్తులతో కూడిన రెండు 7.65ఎంఎం ఆటోమేటిక్ పిస్టల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. 2018లో, సుక్మా జిల్లాలో మావోయిస్టులతో జరిగిన తుపాకీయుద్ధం తర్వాత ‘మేడ్ ఇన్ జర్మనీ’ గుర్తు ఉన్న రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. నారాయణపూర్ జిల్లాలో యూఎస్ తయారు చేసిన సబ్-మెషిన్ గన్‌ని స్వాధీనం చేసుకున్నారు.