త్రిపుర అసెంబ్లీ ఎన్నికల కోసం 48 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను బీజేపీ శనివారం ప్రకటించింది. ధన్‌పూర్ నుంచి కేంద్ర మంత్రి ప్రతిమా భూమిక్‌ను బరిలోకి దింపింది.
అగ్రరాజ్యమైన అమెరికాలో నల్లజాతీయులపై దాడులు ఆగడం లేదు. యూఎస్‌లో ఓ నల్లజాతీయుడిపై పోలీసులు అనుచితంగా ప్రవర్తించారు. మే 2020లో జార్జ్ ఫ్లాయిడ్ అనే యువకుడిని పోలీసులు చితకబాదడంతో అతను మరణించిన సంగతి తెలిసిందే.
తనను హతమార్చేందుకు కుట్ర జరుగుతోందని పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కుట్ర వెనుక పాక్ మాజీ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ పాత్ర ఉందని అన్నారు. తనను హత్య చేసేందుకు అసిఫ్ అలీ జర్దారీ ఉగ్రవాదులకు డబ్బులు ఇచ్చారని శుక్రవారం ఆరోపించారు.
పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న తరుణంలో ఆ దేశ ఆర్థిక మంత్రి ఇషాక్ దార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ అభివృద్ధి బాధ్యతను భగవంతుడైన అల్లాహ్‌పై ఉంచారు.
రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో చార్టర్డ్ విమానం కుప్పకూలింది. సాంకేతిక లోపంతో ఆ విమానం కూలినట్లు తెలిసింది. ఘటనా స్థలానికి పోలీసులు, అధికారులను పంపినట్లు జిల్లా కలెక్టర్ అలోక్ రంజన్ తెలిపారు.
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న దాయాది దేశం పాకిస్థాన్‌కు రూపాయి భారీ షాక్ ఇచ్చింది. దీంతో మూలిగే నక్క మీద తాటిపండు పడ్డ చందంలా తయారైంది పాక్ పరిస్థితి.
గోవా వెళ్లాలని అనుకుంటున్నారా?.. ఇంతకు ముందులాగా అనుమతి లేకుండా పర్యాటకులతో సెల్ఫీలు మాత్రం తీసుకోకండి. ఎందుకంటే.. గోవా సర్కారు కొన్ని ఆదేశాలు జారీ చేసింది.