దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన అండర్ 19 మహిళల టీ20 వరల్డ్‌కప్‌ను భారత్ కైవసం చేసుకుంది. ఆదివారం సాయంత్రం ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో టీమిండియా ఏకపక్ష విజయం సాధించి ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడింది.
కాంగ్రెస్ ఎంపీ, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర సోమవారం శ్రీనగర్‌లోని షేర్-ఏ-కశ్మీర్ స్టేడియంలో ముగుస్తుంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ భావసారూప్యత కలిగిన 23 పార్టీలకు ఆహ్వానం పంపింది.
నాగర్‌కర్నూల్ జిల్లా తెల్కపల్లి మండలం పెద్దపల్లి గ్రామంలోని శ్రీ స్వయంభు బుగ్గ పెంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. శనివారం రాత్రి నిర్వహించిన రథోత్సవంలో భారీ ఎత్తున భక్తులు పాల్గొన్నారు.