మధ్యప్రదేశ్‌లోని పన్నాలో శనివారం ఓ ప్రముఖ వస్త్ర వ్యాపారి తన భార్యను హత్య చేసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంఘటనా స్థలం నుంచి పోలీసులు సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకోవడంతో ఈ వార్త నగరం మొత్తం కలకలం రేపింది.
జవహర్‌లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్న సమయంలో జరిగిన యుద్ధాన్ని ప్రస్తావిస్తూ.. చైనా ఆక్రమించిందని ప్రతిపక్ష నేతలు చెబుతున్న భూమిని వాస్తవానికి 1962లోనే ఆక్రమించారని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ శనివారం పేర్కొన్నారు.
గుజరాత్‌లో జూనియర్ క్లర్క్‌ల నియామకం కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న పోటీ పరీక్షా ప్రశ్నాపత్రం లీక్ అయింది. దీంతో ఆదివారం పరీక్ష జరగడానికి కొన్ని గంటల ముందే ఎగ్జామ్‌ను రద్దు చేశారు.
రష్యా ఆధీనంలో ఉన్న లుగాన్స్క్ పీపుల్స్ రిపబ్లిక్‌లోని ఓ ఆస్పత్రిపై ఉక్రెయిన్ జరిపిన రాకెట్ దాడిలో 14 మంది ప్రాణాలు కోల్పోయారని రష్యా రక్షణ శాఖ వెల్లడించింది.
భారత్ జోడో యాత్ర ముగింపుకు చేరుకుంది. కాంగ్రెస్ పార్టీ గంపెడాశలు పెట్టుకున్న రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర ఈ నెల 30వ తేదీన భారీ బహిరంగ సభతో ముగియనుంది.
పెరూ రాజధాని లిమాకు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 60 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు పెరూలో కొండపై నుంచి లోయలో పడిపోవడంతో 24 మంది మృతి చెందారు.
మాజీ మంత్రి వట్టి వసంత్‌కుమార్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వట్టి వసంత్ కుమార్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.