Pakistan: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న దాయాది దేశం పాకిస్థాన్‌కు రూపాయి భారీ షాక్ ఇచ్చింది. దీంతో మూలిగే నక్క మీద తాటిపండు పడ్డ చందంలా తయారైంది పాక్ పరిస్థితి. పొరుగు దేశం శ్రీలంకలాగే దివాళా దిశగా అడుగులేస్తోంది. ప్రస్తుత అంచనా ప్రకారం పాకిస్తాన్ రూపాయి విలువ భారీగా పతనమైంది. శుక్రవారం డాలర్‌తో పోలిస్తే పాకిస్థాన్ రూపాయి రూ.262.6గా నమోదైంది. దీని ద్వారా అంతర్జాతీయ మార్కెట్‌లో పాక్ రూపాయి మారకం విలువ అత్యల్ప స్థాయికి పడిపోయింది. ప్రస్తుత పాక్ ఆర్థిక పరిస్థితుల్లో ఏదైనా మిత్ర దేశం ఆదుకోవడమో, లేక ఇంటర్నేషనల్ మానెటరీ ఫండ్ (ఐఎమ్ఎఫ్) నుంచి రుణం రావడమో జరిగితే తప్ప ఇప్పటికిప్పుడు పాక్ పరిస్థితి మెరుగపడదు. లేకుంటే పాక్ పూర్తిగా దివాళా ప్రకటించడమే.
1999 తర్వాత మొదటిసారి గురువారం రూ.34 క్షీణించింది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రారంభంలో రూ.265 వరకు పడిపోయిన పాక్ రూపాయి చివరకు రూ.262.6 వద్ద ఆగింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్) సూచన మేరకు ద్రవ్యమారకపు రేటుపై నిబంధనలను పాక్ తాజాగా సడలించింది. ఆ తర్వాత రూపాయి విలువ భారీగా పతనం అవడం గమనార్హం. వచ్చే నెల అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ.. నిధులు విడుదల చేస్తుందని పాక్ ప్రధాని షెహబాజ్ ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు, పాకిస్థాన్‌లో ఆర్థిక సంక్షోభం శ్రీలంకను మించిపోయింది. ఐఎంఎఫ్ ప్యాకేజీ రాకపోవడంతో పాక్ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. దేశం క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటుడం పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు సంకటంగా మారింది. ఆర్థికంగానే కాకుండా రాజకీయంగానూ షరీఫ్ ప్రభుత్వం తీవ్ర ఇబ్బంది పడుతోంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో కరెంటు కూడా సరఫరా చేయలేని పరిస్థితి నెలకొంది. ప్రధాన నగరాలు కూడా కరెంటు కోతతో అల్లాడుతున్నాయి. కొన్ని చోట్ల రాత్రిపూట మాత్రమే కరెంటు సరఫరా ఉంటోంది. పగలంతా కరెంటు కోతలే విధిస్తున్నాయి. ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్నంటాయి. ఎక్కువ ఖరీదు పెట్టి కొనేందుకు సిద్ధమైనప్పటికీ మార్కెట్లో సరుకులు దొరకని పరిస్థితి నెలకొంది.
Congress Leader: అవినీతిపరుల చేతులు విరగ్గొట్టండి.. దుమారం రేపిన కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు
పాకిస్థాన్‌లో ఫారెక్స్ నిల్వలు తక్కువగా ఉండటం వల్ల భారీ ఆహార ద్రవ్యోల్బణం పెరిగింది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో, పిండి ప్యాకెట్‌ను రూ.3000 వరకు విక్రయిస్తున్నారు. తిండి కోసం కొట్లాటలు, ఫుడ్ ట్రక్కులను వెంబడిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. తరచు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో దేశం కూడా అంధకారంలో కూరుకుపోయింది. పాకిస్తాన్ సెంట్రల్ బ్యాంక్ ఈ వారం కూడా పెరుగుతున్న ధరలతో పోరాడటానికి వడ్డీ రేట్లను 24 సంవత్సరాల గరిష్ట స్థాయికి పెంచింది.