బెల్జియం వివాదాస్పద అణు రియాక్టర్‌ను మూసివేయనుంది. బెల్జియం అణు శక్తి నుంచి మొత్తం నిష్క్రమణను ఆలస్యం చేసినప్పటికీ, పొరుగున ఉన్న జర్మనీతో వివాదానికి కారణమైన వృద్ధాప్య అణు రియాక్టర్‌ను మూసివేసేందుకు సిద్ధమైంది.
పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో గల మసీదులో ఆత్మాహుతి దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడిలో మృతుల సంఖ్య 100కు పెరిగిందని పోలీసులు వెల్లడించారు. మృతదేహాలను వెలికితీసే ప్రయత్నాలను రెస్క్యూ బృందం ముమ్మరం చేస్తున్నట్లు అధికారులు చెప్పారు.
ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ హత్యలపై ఉత్తరాఖండ్ మంత్రి గణేష్ జోషి సంచలన వ్యాఖ్యలు చేశారు. బలిదానం అనేది గాంధీ కుటుంబానికి చెందిన గుత్తాధిపత్యం కాదని, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ హత్యలు ప్రమాదాలేనని మంత్రి గణేష్ జోషి మంగళవారం అన్నారు.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించనున్న 2024 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ భారతదేశ ఆర్థిక వృద్ధి అంచనా రేటును 6.8 శాతానికి తీసుకెళ్లడానికి పునాది వేయనుంది. 2019 తర్వాత ఐదో సారి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు.
కాంగ్రెస్ ఎంపీ, అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఆదివారం పూర్తి కాగా.. శ్రీనగర్‌లో సోమవారం కాంగ్రెస్ ఘనంగా ముగింపు వేడుకలు నిర్వహిస్తోంది.
క్షణికావేశాల కారణంగా నేరాల సంఖ్య పెరిగిపోతోంది. ఇటీవల అనుమానమనే పెనుభూతం సంబంధాలను తుంచివేస్తోంది. తాజాగా ఇంటికి ఆలస్యంగా వచ్చినందుకు గొడవపడి ఓ మహిళ తన భర్త ముఖంపై యాసిడ్ పోసింది.