Bus Accident: పెరూ రాజధాని లిమాకు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 60 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు పెరూలో కొండపై నుంచి లోయలో పడిపోవడంతో 24 మంది మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. పలువురు ప్రయాణికులు బస్సులో నుంచి కిందపడగా, మరికొందరు బస్సులో చిక్కుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నామన్నారు.
Gauhati High Court: జీన్స్ వేసిన న్యాయవాది.. దిమ్మతిరిగే షాకిచ్చిన హైకోర్టు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోరియాంకా టూర్స్ కంపెనీకి చెందిన బస్సు, లిమా నుంచి బయలుదేరి ఈక్వెడార్ సరిహద్దులోని టుంబేస్‌కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. “డెవిల్స్ కర్వ్” అని పిలువబడే ప్రదేశంలో ప్రమాదం జరిగిందని సంఘటనా స్థలంలో ఉన్న పోలీసులు స్థానిక మీడియాకు తెలిపారు. గాయపడిన ప్రయాణికులను ఎల్ ఆల్టో, మాన్‌కోరాలోని ఆసుపత్రులకు తరలించారు. కొందరు ప్రయాణికులు హైతీకి చెందిన వారని పోలీసులు తెలిపారు.పెరూలో హైతీ వలసదారుల సంఖ్య పెరుగుతోంది. అయితే బస్సులో ఉన్న వారి పరిస్థితి ఇంకా తెలియరాలేదు.