Cancer Awareness Walk: భయంకరమైన క్యాన్సర్ వ్యాధి పట్ల అవగాహన కల్పించేందుకు వాక్ నిర్వహించడం అభినందనీయమని ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్ అన్నారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని కేర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో కేబీఆర్ పార్క్ నుంచి ఆసుపత్రి వరకు నిర్వహించిన వాక్‌ను వైద్యులతో కలిసి ఆయన ప్రారంభించారు. క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు ప్రారంభించిన ఈ నడకలో వైద్యులతో పాటు చాలా మంది పాల్గొన్నారు.
Inorbit Mall: అటు వెళ్లకండి.. వెళ్తే మాత్రం ఇరుక్కుంటారు జాగ్రత్త
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్యాన్సర్ వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రారంభ దశలోనే క్యాన్సర్‌ను గుర్తించడం ఎలా, వ్యాధి బారిన పడ్డ తర్వాత అందుబాటులో ఉన్న వైద్యం తదితర అంశాలను నగర ప్రజలకు తెలియజేసేందుకు వారం రోజులపాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం సంతోషకరమని అన్నారు. ఊబకాయం, సరైన వ్యాయామం లేకపోవడం, మద్యం సేవించడం, దూమపానం వంటి అలవాట్ల వలన క్యాన్సర్‌వ్యాధి వస్తుందని జయేష్ రంజన్ పేర్కొన్నారు. సరైన అలవాట్లను అలవర్చుకుంటే క్యాన్సర్ వ్యాధిని నివారించవచ్చని తెలిపారు. క్యాన్సర్ వ్యాధిపై స్ర్కీనింట్ టెస్టుల గురించి తర్వాత స్వీయపరీక్ష నిర్వహించుకోవడంపై వివరించారు. అవగాహన వారోత్సవాల్లో భాగంగా మహిళలకు బ్రెస్ట్, సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను ఉచితంగా అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.