Madhyapradesh Man Kills Wife and Shoots Self: మధ్యప్రదేశ్‌లోని పన్నాలో శనివారం ఓ ప్రముఖ వస్త్ర వ్యాపారి తన భార్యను హత్య చేసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంఘటనా స్థలం నుంచి పోలీసులు సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకోవడంతో ఈ వార్త నగరం మొత్తం కలకలం రేపింది. తుపాకీ గాయాలతో మృతదేహాలు లభ్యమయ్యాయి. ఘటనా స్థలంలో సూసైడ్ నోట్‌ను కూడా పోలీసులు కనుగొన్నారు. దాని ఆధారంగా వారు దర్యాప్తు ప్రారంభించారు. వ్యాపారవేత్త సంజయ్ సేథ్ బాగేశ్వర్ ధామ్ భక్తుడు. తన సూసైడ్ నోట్‌లో “గురూజీ, నన్ను క్షమించు. నాకు మరో జన్మ లభిస్తే, నేను మీ స్థిర భక్తుడిగా ఉంటానని” రాశాడు.
ఈ ఘటనకు ముందు సంజయ్ సేథ్ ఒక వీడియోను కూడా రికార్డ్ చేశాడు, అందులో అతను ఏడుస్తూ కనిపించాడు. కొందరు తన నుంచి అప్పుగా తీసుకున్న డబ్బును తిరిగి చెల్లించలేదని పేర్లను చెప్పాడు. “దయచేసి నా పిల్లలు, నా కుమార్తె వివాహం కోసం నా డబ్బు తిరిగి ఇవ్వండి. ఆమె పెళ్లిని రూ.50 లక్షల నుంచి కోటిలో నిర్వహించండి, నా కుమార్తె ఖాతాలో డబ్బు ఉంది. రూ.29 లక్షలు లాకర్‌లో ఉంచబడింది. నా భార్య, నేను ఇద్దరం బతకలేక వెళ్ళిపోతున్నాం. కూతురికి చాలా నగలు ఉన్నాయి. నా పిల్లలు, నన్ను క్షమించండి” అంటూ లేఖలో రాశాడు.
Crime News: దారుణం.. మతిస్థిమితం లేని బాలికపై ఇద్దరు అత్యాచారం
సంజయ్ సేథ్ తన భార్య మీనుతో కలిసి నగరం నడిబొడ్డున ఉన్న కిషోర్‌గంజ్ ప్రాంతంలో నివసించేవాడు. సంఘటన జరిగిన సమయంలో సంజయ్, మీను ఇద్దరూ ఇంటి రెండో అంతస్తులోని గదిలో ఉన్నారు. కాల్పుల శబ్ధం విని ఇతర కుటుంబ సభ్యులు పైకి చేరుకున్నారు. అప్పటికే ఆ మహిళ మృతి చెందగా, సంజయ్ ఊపిరి పీల్చుకుంటూనే ఉన్నాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించేలోపే అతడు మృతి చెందాడు.
పన్నా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ధరమ్‌రాజ్ మీనా మాట్లాడుతూ, ప్రాథమికంగా ఈ విషయం గృహ వివాదానికి సంబంధించినదిగా కనిపిస్తోందన్నారు. ఇది చాలా బాధాకరమైన సంఘటన అని, విచారణ కొనసాగుతోందన్నారు. ప్రస్తుతం, బయటి వ్యక్తి ప్రమేయం ఉన్నట్లు కనిపించడం లేదన్నారు. ఆ గదిలో దంపతులు ఒంటరిగా ఉన్నారని.. తాము మేము అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్నారు.