S Jaishankar: 1962లోనే ఆక్రమించారు.. రాహుల్‌పై విరుచుకుపడిన కేంద్ర మంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
S Jaishankar: జవహర్‌లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్న సమయంలో జరిగిన యుద్ధాన్ని ప్రస్తావిస్తూ.. చైనా ఆక్రమించిందని ప్రతిపక్ష నేతలు చెబుతున్న భూమిని వాస్తవానికి 1962లోనే ఆక్రమించారని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ శనివారం పేర్కొన్నారు. లడఖ్‌లో భూభాగాన్ని కోల్పోవడంపై అధికారిక నివేదిక గురించి ఇటీవల మాట్లాడిన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై కూడా ఆయన విరుచుకుపడ్డారు. “కొన్నిసార్లు వారు తమకు తెలిసిన వార్తలను అబద్ధం అని ప్రచారం చేస్తారు. ఇది ఇప్పుడే జరిగినట్లు వారు ప్రొజెక్ట్ చేస్తారు, వాస్తవానికి ఇది 1962లో జరిగినప్పుడు … వారు దాని గురించి మాట్లాడరు,” అని ఆయన అన్నారు.
భూభాగాన్ని కోల్పోవడంపై, తూర్పు లడఖ్‌లోని 65 పెట్రోలింగ్ పాయింట్లలో 26కి భారతదేశం యాక్సెస్ కోల్పోయిందని లడఖ్‌లోని సీనియర్ పోలీసు అధికారి నివేదికను ఉదహరించిన వారిలో ఇటీవల రాహుల్ గాంధీ కూడా ఉన్నారు. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ హాజరైన దేశంలోని అత్యున్నత పోలీసు అధికారుల సదస్సులో ఈ నివేదికను సమర్పించారు. ఈ నివేదికను ఆధారంగా చేసుకొని రాహుల్ గాంధీ సహా పలువురు ప్రతిపక్ష పార్టీ నాయకులు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అయితే పుణెలో శనివారం జరిగిన కార్యక్రమంలో జైశంకర్ మాట్లాడుతూ, వాటిని ఎదుర్కొనేందుకు ప్రయత్నించారు.
Also Read
- Iran-US Ceasefire: గుడ్‌న్యూస్.. కాల్పుల విరమణకు అమెరికా-ఇరాన్ అంగీకారం?
- Islamabad: ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. అగ్నికి ఆహుతైన 15 మంది నవజాత శిశువులు
- WhatsApp: వాట్సాప్ వినియోగదారులకు మైండ్ బ్లోయింగ్ అప్డేట్.. ఇక మీ అకౌంట్‌కు డబుల్ ప్రొటెక్షన్!
- Fake Cancer Drugs: క్యాన్సర్ బాధితుల ప్రాణాలతో చెలగాటం.. నీళ్లతో నింపిన నకిలీ ఇంజెక్షన్ల విక్రయం గుట్టురట్టు
Exam Cancelled: జూనియర్ క్లర్క్ పరీక్ష పేపర్ లీక్.. ఎగ్జామ్ రద్దు
2017లో రాహుల్ గాంధీ చైనా రాయబారితో సమావేశంపై కేంద్ర మంత్రి జైశంకర్ ఈ సందర్భంగా పరోక్షంగా విమర్శలు గుప్పించారు. తాను ఏదైనా తెలుసుకోవాలంటే, ఇన్‌పుట్‌లు పొందడానికి తాను చైనా రాయబారి వద్దకు వెళ్లను అని, కానీ సైనిక నాయకత్వం దగ్గర సందేహాలను నివృత్తి చేసుకుంటానన్నారు. చైనా ప్రతినిధులను కలవడంపై స్పందించిన రాహుల్ గాంధీ స్పందిస్తూ.. కీలక అంశాలపై సమాచారం తెలుసుకోవడం నా విధి అని అన్నారు. ఈ క్రమంలోనే చైనా రాయబారి, భూటాన్ రాయబారి సహా మాజీ జాతీయ భద్రతా సలహాదారు, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ నాయకులను కలిశానని తెలిపారు.
తాజావార్తలు
-
Lurk OTT Release: ఆ అడవిలో అసలు భయం మనుషులే.. ఓటీటీలోకి మలయాళం సర్వైవల్ థ్రిల్లర్.. 8.8 ఐఎండీబీ రేటింగ్
-
Iran-US Ceasefire: గుడ్‌న్యూస్.. కాల్పుల విరమణకు అమెరికా-ఇరాన్ అంగీకారం?
-
Islamabad: ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. అగ్నికి ఆహుతైన 15 మంది నవజాత శిశువులు
-
US Visa Interview Pause: అమెరికా వీసా కోసం ఎదురుచూస్తున్నవారికి షాక్.. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్వ్యూలు వాయిదా, కారణం ఇదే!
-
Ravi Teja-Irumudi: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘ఇరుముడి’.. రవితేజ @ 100 కోట్ల సినిమాల లిస్ట్ ఇదే!
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్‌ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!