యావత్ ప్రపంచాలని కొవిడ్ మహమ్మారి గడగడలాడించిన సంగతి తెలిసిందే. కరోనా నాటి రోజులు గుర్తొస్తేనే గుండెల్లో వణుకుపుడుతుంది. కఠినమైన లాక్‌డౌన్‌లు, భౌతిక దూరాలు, వ్యాక్సిన్‌లతో కరోనా నుంచి ప్రపంచం బయటపడగలిగింది. ఆ సమయంలో జైళ్లు కూడా నిండిపోయాయి,
పార్లమెంటు సభ్యునిగా అనర్హత వేటు పడిన తర్వాత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. తాను భారత్ స్వరం కోసం పోరాడుతున్నానని.. ఎంతవరకైనా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీని అవమానించేలా చేసిన వ్యాఖ్యకు పరువునష్టం కేసులో దోషిగా తేలిన ఒక రోజు రాహుల్‌పై అనర్హత వేటు పడడం గమనార్హం.
ఎంపీగా అనర్హత వేటు పడిన నేపథ్యంలో, క్రిమినల్ పరువునష్టం కేసులో హైకోర్టు నుంచి ఉపశమనం పొందకుంటే రాహుల్ గాంధీ ఢిల్లీలోని లుటియన్స్‌లోని తన అధికారిక బంగ్లాను ఒక నెలలోపు ఖాళీ చేయాల్సి ఉంటుందని ఒక అధికారి శుక్రవారం తెలిపారు. 2004లో లోక్‌సభ ఎంపీగా ఎన్నికైన తర్వాత రాహుల్‌గాంధీకి తుగ్లక్ లేన్ బంగ్లాను కేటాయించారు.
రువునష్టం కేసులో రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన పార్లమెంటు సభ్యత్వంపై అనర్హత వేటు పడింది. ఈ క్రమంలో జైలు శిక్ష పడి, చట్టసభ సభ్యత్వాలను కోల్పోయిన వారు అనేక మంది ఉన్నారు. ఈ జాబితాలో రాహుల్ గాంధీ చేశారు.
మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతకు లంచం ఇవ్వజూపినందుకు, ఆమెను బెదిరించినందుకు అరెస్టయిన అనిక్ష జైసింఘానిని ముంబైలోని కోర్టు శుక్రవారం నాడు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. ఆమె పోలీసు రిమాండ్ పొడిగించాలన్న పోలీసుల విజ్ఞప్తిని తిరస్కరించింది.
బాలీవుడ్ గ్లామరస్ బ్యూటీ పరిణీతి చోప్రా గత కొంతకాలంగా ప్రేమలో ఉందని అనేక కథనాలు వెలువడిన సంగతి తెలిసిందే. మొదట ఆమె ఒక ప్రముఖ వ్యాపారవేత్తతో ప్రేమలో ఉందని.. త్వరలోనే పెళ్లికూడా చేసుకోబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఊహించని విధంగా ఆ వ్యక్తి ఓ రాజకీయ నాయకుడు అని తెలియడంతో ఈ విషయం మరింత వైరల్‌గా మారింది.
లోక్‌సభ ఎంపీగా రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడింది. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య అని, రాహుల్ కోసం పోరాటం చేస్తామని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రకటించారు.
భారత పర్యటనలో ఉన్న ప్రపంచ బ్యాంకు అధ్యక్ష పదవికి నామినేట్ అయిన భారతీయ అమెరికన్ అజయ్ బంగాకు ఢిల్లీ వచ్చిన తర్వాత కొవిడ్ పాజిటివ్ అని తేలింది. మూడు వారాల ప్రపంచ పర్యటనలో భాగంగా మార్చి 23న అజయ్ బంగా ఢిల్లీకి చేరుకున్నారు.
లోక్‌సభ 64 అధికారిక సవరణలతో ఆర్థిక బిల్లు-2023ని ఆమోదించింది. సీతారామన్ పార్లమెంట్‌లో ఫైనాన్స్ బిల్లు 2023ని ప్రవేశపెట్టారు. అదానీ సమస్యపై జేపీసీ విచారణను డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష ఎంపీల భారీ నినాదాల మధ్య చివరికి వాయిస్ ఓటింగ్ ద్వారా ఆమోదించబడింది.