అనుమానం పెనుభూతమైంది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త అత్యంత కిరాతకంగా ప్రవర్తించాడు. భార్యను గొంతు నులిమి హత్య చేసి అనంతరం మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి పాతిపెట్టాడు. ఈ దారుణం బెంగాల్‌లో బిష్ణుపుర్ ప్రాంతంలో చోటుచేసుకుంది.
అదానీ గ్రూప్‌పై గత జనవరిలో సంచలన ఆరోపణలు చేసిన యూఎస్ షార్ట్ షెల్లర్ సంస్థ హిండెన్ బర్గ్ రీసెర్చ్ మరో సంచలన ప్రకటన చేసింది. హిండెన్‌బర్గ్ రీసెర్స్ తన బాంబును ఈ సారి ట్విటర్ మాజీ సీఈవో జాక్ డోర్సేపై వేసింది.
ఐక్యరాజ్య సమితిలో పాకిస్థాన్ మరోసారి భారత్‌ను ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నాలు చేసింది. అయితే, పాక్ చర్యలను భారత్ సమర్థంగా తిప్పికొట్టింది. భారతదేశంలో మత సామరస్యాన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలకు వ్యతిరేకంగా హెచ్చరించింది.
రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌లకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు ఇచ్చారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్‌లో తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని నోటీసుల్లో పేర్కొన్నారు. ఉద్యోగాల జాతరకు పాతరేయాలన్న విపక్షాల కుట్రలు సాగనివ్వబోమని మంత్రి పేర్కొన్నారు.
పంజాబ్ కాంగ్రెస్ కమిటీ మాజీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్య, నవజ్యోత్ కౌర్ సిద్ధూ తనకు స్టేజ్ 2 ఇన్వేసివ్ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని, ఈరోజు తర్వాత ఆమెకు శస్త్రచికిత్స చేయబోతున్నారని ట్విట్టర్‌లో వెల్లడించారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో ఇవాళ సమావేశమయ్యారు. లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఇద్దరు బీజేపీయేతర ముఖ్యమంత్రులు భేటీ కావడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
దేశాన్ని, పార్లమెంటును అప్రతిష్టపాలు చేసినందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జాతికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ బుధవారం పార్లమెంటులో అన్నారు. ఈ విషయం యునైటెడ్ కింగ్‌డమ్‌లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో రాహుల్ గాంధీ చేసిన ప్రసంగానికి సంబంధించినది.
దుబాయి రాక ముందు ఒక సాధారణ భారతీయుడు అయిన అమృత్‌పాల్ సింగ్.. కనీసం స్వీయ మతాచారాలను కూడా పాటించని వ్యక్తి కరుడుగట్టిన మతోన్మాదిగా మారిపోయాడు. ఉపాధి కొరకు గల్ప్‌కు వచ్చిన ఒక సాదాసీదా గ్రామీణ యువకుడు సామాజిక మాధ్యమాల పుణ్యమా అంటూ ఏ విధంగా దేశభద్రతకు సవాల్ విసురుతున్నాడో పంజాబీ ప్రవాసుడు అమృతపాల్ సింగ్ ఉదంతాన్ని గమనిస్తే అర్థమవుతుంది.
తమిళనాడులో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి కోర్టు ఆవరణలోనే తన భార్య ముఖంపై యాసిడ్ పోశాడు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటనలో భార్యతో పాటు ఆమె పక్కనే ఉన్న మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.