Ajay Banga: భారత పర్యటనలో ఉన్న ప్రపంచ బ్యాంకు అధ్యక్ష పదవికి నామినేట్ అయిన భారతీయ అమెరికన్ అజయ్ బంగాకు ఢిల్లీ వచ్చిన తర్వాత కొవిడ్ పాజిటివ్ అని తేలింది. మూడు వారాల ప్రపంచ పర్యటనలో భాగంగా మార్చి 23న అజయ్ బంగా ఢిల్లీకి చేరుకున్నారు. రొటీన్ టెస్టుల్లో భాగంగా ఆయనకు పాజిటివ్ అని తేలింది. స్థానిక మార్గదర్శకాల ప్రకారం ఇప్పుడు ఆయన క్వారంటైన్‌లో ఉన్నారు. ‘రొటీన్ టెస్టింగ్‌లో భాగంగా అజయ్ బంగాకు కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఎటువంటి లక్షణాలు లేవు. అయితే, స్థానిక నిబంధనల ప్రకారం ప్రస్తుతం ఆయన ఐసోలేషన్‌లో ఉన్నారు’ అని ల్లీలోని యుఎస్ ఎంబసీ ప్రతినిధి ఒకరు తెలిపారు. బంగా తన పర్యటన కోసం ఇంతకు ముందే అనేక పరీక్షలు చేయించుకున్నారని.. అప్పుడు బాగానే ఉన్నారని.. భారత్‌కు చేరుకున్నాక పాజిటివ్ అని తేలిందని ఢిల్లీలోని యుఎస్ ఎంబసీ ప్రతినిధి అన్నారు.
Read Also: Central Funds: కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన నిధులు ఇవే.. ఆర్థిక మంత్రి ప్రకటన
అజయ్ బంగా తన భారత పర్యటన సందర్భంగా విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ప్రధాని మోదీని కలవనున్నారు. ప్రపంచ బ్యాంకు, భారత అభివృద్ధి ప్రాధాన్యతలు, ప్రపంచ ఆర్థికాభివృద్ధికి ఎదురవుతున్న ఇబ్బందులపై ప్రధానంగా చర్చ జరగనుంది. అజయ్ బంగా ఇప్పటివరకు భారత్‌లోని ఎవరినీ కలవలేదు. అజయ్ బంగా మూడు వారాల ప్రపంచ పర్యటనలో ఢిల్లీ (Delhi) సందర్శన చివరిది. ఆఫ్రిక నుంచి ప్రారంభమైన ఆయన పర్యటన యూరప్, లాటిన్ అమెరికా మీదుగా ఆసియాకు చేరుకుంది. ప్రపంచ బ్యాంకు ప్రెసిడెంట్‌గా నామినేషన్ ప్రకటించిన వెంటనే భారత ప్రభుత్వం బంగా అభ్యర్థిత్వాన్ని ఆమోదించింది. అప్పటి నుంచి బంగ్లాదేశ్, కోట్ డి ఐవోయిర్, కొలంబియా, ఈజిప్ట్, ఫ్రాన్స్, జర్మనీ, ఘనా, ఇటలీ, జపాన్, కెన్యా, సౌదీ అరేబియా, రిపబ్లిక్ ఆఫ్ కొరియా యునైటెడ్ వంటి వివిధ ప్రభుత్వాల సంకీర్ణం బంగాకు తమ మద్దతును తెలియజేశాయి.