Raghav Chadha: బాలీవుడ్ గ్లామరస్ బ్యూటీ పరిణీతి చోప్రా గత కొంతకాలంగా ప్రేమలో ఉందని అనేక కథనాలు వెలువడిన సంగతి తెలిసిందే. మొదట ఆమె ఒక ప్రముఖ వ్యాపారవేత్తతో ప్రేమలో ఉందని.. త్వరలోనే పెళ్లికూడా చేసుకోబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఊహించని విధంగా ఆ వ్యక్తి ఓ రాజకీయ నాయకుడు అని తెలియడంతో ఈ విషయం మరింత వైరల్‌గా మారింది. ఆయన మరెవరో కాదు ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేత రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా అని తెలుస్తోంది. ఇటీవల ముంబైలోని ఓ రెస్టారెంట్‌లో రాఘవ్ చద్దా, పరిణీతి చోప్రా ఒకే చోట కనిపించడం అందరికీ కాస్త ఆశ్చర్యాన్ని కలిగించింది. వారు రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చి కారులో కలిసి బయల్దేరినట్లు ఉన్న వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. వారు దీనిపై క్లారిటీ ఇవ్వకముందే రకరకాల కథనాలు వెలువడ్డాయి.
రాఘవ్‌తో పరిణీతి ప్రేమలో మునిగి తేలుతోందని.. త్వరలో వారు పెళ్లి చేసుకోబోతున్నారనే కథనాలు కూడా రావడం గమనార్హం. అయితే ఈ విషయంలో ఇంకా వారిద్దరి నుంచి క్లారిటీ రాలేదు. ఇటీవల రాఘవ్‌ను మీడియా కొన్ని ప్రశ్నలు వేసింది. ఆయన కారు ఎక్కేందుకు వెళ్తుండగా.. పరిణీతి చోప్రోకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అయిందని ఈ విషయంపై ఎలాంటీ క్లారిటీ ఇస్తారని అడగడంతో ఆయన నవ్వుతూ ఆ విషయాన్ని దాటవేసే ప్రయత్నం చేశారు. ‘ఏవైనా ప్రశ్నలు ఉంటే రాజనీతి గురించి అడగండి.. కానీ పరిణీతి గురించి కాదు’ అని రాఘవ్ చద్దా నవ్వుతూ సమాధానం ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో పరిణీతి చోప్రాతో రాఘవ్ ప్రేమలో ఉన్నారా లేదా అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. మరో వైపు పరిణీతి కూడా ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. వీరిద్దరి డేటింగ్‌లో ఉన్నారనే పుకార్లు మాత్రం వేగంగా షికారు చేస్తున్నాయి.
AAP's Raghav Chadha refuses to comment on Relationship rumours, Says Ask Question about Rajneeti Not Parineeti pic.twitter.com/z6NjCWhqjT
— Megh Updates 🚨™ (@MeghUpdates) March 24, 2023
Read Also: Manchu Manoj: అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టిన సారథి.. అసలు ఎవరితను..?
2022లో 33 సంవత్సరాల వయస్సులో రాఘవ్ చద్దా పంజాబ్ రాష్ట్రం నుంచి అతి పిన్న వయస్కుడైన పార్లమెంటు సభ్యుడిగా రాజ్యసభకు ఎంపికయ్యారు. ఈ సంవత్సరం ప్రారంభంలో, లండన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఇండియా-యూకే అత్యుత్తమ అచీవర్స్ గౌరవంతో సత్కరించారు. పరిణీతి చోప్రా 24 సంవత్సరాల వయస్సులో 2011లో ‘లేడీస్ వర్సెస్ రికీ బహ్ల్’తో బాలీవుడ్‌లో అరంగేట్రం చేసింది. పరిణీతి చోప్రా చివరిసారిగా ‘ఉంచై’లో అమితాబ్ బచ్చన్, అనుపమ్ ఖేర్, బోమన్ ఇరానీ, డానీ డెంజోంగ్పాతో కలిసి కనిపించింది. ఆమె తదుపరి ‘చమ్కిలా’, ‘క్యాప్సూల్ గిల్’ చిత్రాలలో కనిపించనుంది.
Raghav Chadha & Parineeti Chopra spotted together at a restaurant in Mumbai, pic.twitter.com/HnQJOW8xXV
— News Arena India (@NewsArenaIndia) March 23, 2023