Uddav Thackeray: ఇది నియంతృత్వ అంతానికి నాంది.. కేంద్రంపై ఉద్ధవ్ ఆగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uddav Thackeray: రాహుల్ గాంధీపై ఎంపీగా అనర్హత వేటు వేయడంపై ఉద్ధవ్ ఠాక్రే కేంద్రంపై మండిపడ్డారు. శివసేన (యూబీటీ) పార్టీకి నాయకత్వం వహిస్తున్న ఉద్ధవ్ ఠాక్రే శుక్రవారం కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై అనర్హత వేటును ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడంగా అభివర్ణించారు. ఇది నియంతృత్వ అంతానికి నాంది అని అన్నారు. ప్రస్తుతం దొంగను దొంగ అని పిలవడం నేరంగా మారిందని, అయితే దేశాన్ని దోపిడీ చేసేవారు బయటే ఉన్నారని ఉద్ధవ్ థాక్రే ఒక ప్రకటనలో అన్నారు. “ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం. అన్ని ఏజెన్సీలు ఒత్తిడిలో ఉన్నాయి. ఇది నియంతృత్వ ముగింపుకు నాంది.. యుద్ధానికి ఒక దిశ మాత్రమే అవసరం ” అని థాక్రే అన్నారు.
2019 క్రిమినల్ పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించిన మరుసటి రోజే, లోక్‌సభ సెక్రటేరియట్ రాహుల్ గాంధీని లోక్‌సభ నుంచి అనర్హులుగా ప్రకటించడం గమనార్హం. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేస్తున్నట్లు లోక్‌సభ సెక్రటేరియట్ నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఇది రాహుల్‌ను దోషిగా నిర్ధారించిన రోజు మార్చి 23 నుండి అమలులోకి వస్తుంది.
Also Read
- ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
- PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
- OTR: ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీలో కుమ్ములాట ..అసలు కథేంటి?
- Trump-Jinping: ఇరాన్‌కు సాయపడడం భావ్యం కాదు.. జిన్‌పింగ్‌కు ట్రంప్ హితవు
Read Also: Amruta Fadnavis: అమృత ఫడ్నవీస్‌కు లంచం ఇచ్చేందుకు యత్నం.. మహిళకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ
“కోర్టు ఆఫ్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్, సూరత్ ఆయనను దోషిగా నిర్ధారించిన తర్వాత.. కేరళలోని వయనాడ్ పార్లమెంటరీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్‌సభ సభ్యుడు రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించిన తేదీ నుంచి అంటే 23 మార్చి, 2023 నుండి లోక్‌సభ సభ్యత్వానికి అనర్హుడయ్యాడు.” నోటిఫికేషన్ పేర్కొంది. రాహుల్ గాంధీ తన నేరారోపణ, శిక్షపై ఉన్నత న్యాయస్థానం స్టే విధించకపోతే ఎనిమిదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయలేరు.
తాజావార్తలు
-
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
-
OTR: టీడీపీ-వైసీపీ ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’?రామేశ్వరం మెట్టపై హాట్ డిస్కషన్..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!