డఖ్ ప్రాంతంలో కమ్యూనికేషన్, 5జీ ఇంటర్నెట్ సేవలను పెంచడానికి ప్రభుత్వం దాదాపు 500 మొబైల్ టవర్లను ఏర్పాటు చేస్తోంది. వాస్తవ నియంత్రణ రేఖ లేదా ఎల్‌ఏసీ సమీపంలో మొబైల్ టవర్ల సంస్థాపనతో సహా చైనా భారీ మౌలిక సదుపాయాల తరలింపును ఎదుర్కోవడానికి ఇది సహాయపడుతుంది.
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కొవిడ్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యం కేంద్ర హైఅలర్ట్ ప్రకటించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు కొవిడ్ అలర్ట్ జారీ చేసింది. కేసులు రోజురోజుకు పెరుగుతుండడంతో రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేసింది.
కేరళ కొల్లాంలోని చవరాలో ఉన్న ప్రసిద్ధ కొట్టన్‌కులంగర దేవి ఆలయంలో చమయవిళక్కు ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల్లో సాంప్రదాయ ఆచారాలలో భాగంగా చివరి రెండు రోజులలో వేలాది మంది పురుషులు స్త్రీల వేషధారణలో పూజలు చేస్తారు. 19 రోజుల పాటు జరిగే వార్షిక ఆలయ ఉత్సవాల్లో చివరి రెండు రోజులలో పురుషులు స్త్రీల వేషధారణ చేస్తే, స్థానిక దేవుడు సంతోషించి వారి కోరికలను తీరుస్తాడని దీని వెనుక ఉన్న నమ్మకం.
భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన తిరుపతి జిల్లాలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి వన్‌వెబ్‌కు చెందిన 36 ఉపగ్రహాలను ఆదివారం ఎల్‌వీఎం-3 వాహకనౌక ద్వారా నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు.
పరారీలో ఉన్న ఇస్లామిక్ బోధకుడు జకీర్ నాయక్ ఒమన్‌లో చేసిన ప్రసంగంలో హిందువుల గురించి ప్రస్తావించారు. భారతదేశంలోని మెజారిటీ హిందువులు తనను ఎంతగానో ప్రేమిస్తున్నారని, ఇది ఓటు బ్యాంకు కోసం సమస్యను సృష్టిస్తోందని అన్నారు
కర్ణాటక ఎన్నికలకు ముందు బెంగళూరులో కొత్త మెట్రో లైన్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారు. రూ.4,249 కోట్ల వ్యయంతో నిర్మించిన 13.71 కి.మీ మేరకు వైట్‌ఫీల్డ్ (కడుగోడి) నుంచి కృష్ణరాజపురం మెట్రో లైన్‌ను 12 స్టేషన్‌లతో శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.
కేంద్రంలోని మోదీ సర్కారు ఉద్యోగులు, పింఛనుదారులకు శుభవార్త తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్ల డియర్‌నెస్ అలవెన్స్‌ను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
బాపూజీ మహాత్మాగాంధీపై జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహాత్మాగాంధీ ఎలాంటి డిగ్రీలు చేయలేదని ఆయన వ్యాఖ్యానించారు. గురువారం గ్వాలియర్‌లోని ఐటీఎం యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమానికి సిన్హా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
క్రిమినల్ పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీ దోషిగా తేలడం, ఆయనపై వెంటనే అనర్హత వేటు పడడం.. 2013లో జరిగిన ఓ సంఘటనను గుర్తు చేస్తోంది. 2013లో సెప్టెంబర్‌లో రాహుల్ గాంధీ మీడియా సమావేశంలో ఓ ఆర్డినెన్స్ కాపీని చించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.