అమెరికాలోని కాలిఫోర్నియాలో బుధవారం శక్తివంతమైన సుడిగాలి అతలాకుతలం చేసింది. లాస్ ఏంజిల్స్ సమీపంలోని మోంటెబెల్లో నగరాన్ని కదిలింది. మాంటెబెల్లో నగరంలో సుడిగాలి వల్ల ఇళ్లు, వాహనాలు ధ్వంసమయ్యాయి.
వ్లాదిమిర్ పుతిన్‌పై అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ (ఐసీసీ) వారెంట్ జారీ చేసిన తర్వాత విదేశాల్లో వ్లాదిమిర్ పుతిన్‌ను అరెస్టు చేసే ప్రయత్నాలను మాస్కో "యుద్ధ ప్రకటన"గా చూస్తుందని రష్యా మాజీ అధ్యక్షుడు డిమిత్రి మెద్వెదేవ్ హెచ్చరించారు.
దేశంలో బీజేపీ బలోపేతం కొత్త వ్యూహాన్ని అమలు చేసింది. పలు రాష్ట్రాలకు కొత్త పార్టీ చీఫ్‌లను నియమించింది. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ తన ఢిల్లీ, బీహార్, రాజస్థాన్ రాష్ట్ర యూనిట్లకు కొత్త చీఫ్‌లను గురువారం నియమించింది.
తల్లిదండ్రులు తమ వివాహాన్ని అడ్డుకున్న 60 ఏళ్ల తర్వాత టీన్ స్వీట్‌హార్ట్స్ చివరకు వివాహం చేసుకున్నారు. లెన్ ఆల్‌బ్రైటన్‌కు 19 ఏళ్లు, జీనెట్ స్టీర్ 18 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు 1963లో మొదటిసారి కలుసుకున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి భూకంపం సంభవించింది. మంగళవారం రాత్రి ఢిల్లీని భూకంపం వణికించిన విషయం తెలిసిందే. ఢిల్లీ ప్రజలను ఆ భయం వెంటాడుతున్న సమయంలోనే మరోసారి భూకంపం సంభవించడం గమనార్హం.
కొవిడ్-19 కేసులు మళ్లీ పెరుగుతుండటంతో దేశంలో పరిస్థితి, ప్రజారోగ్య సంసిద్ధతను సమీక్షించడానికి ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. కొవిడ్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు కీలక సూచనలు చేశారు.
వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ చాటిన ప్రముఖులకు పద్మ అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్ హాలులో జరిగిన ఈ వేడుకలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా ప్రతిష్ఠాత్మక పురస్కారాలు ప్రదానం చేశారు
ఈ రోజు మీరు మీ జీవితంలో ఎంత సంతృప్తిగా లేదా సంతోషంగా ఉన్నారు? ఉక్రెయిన్, రష్యా, పాకిస్థాన్, ఇరాక్, శ్రీలంక వంటి యుద్ధం లేదా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న దేశాల్లోని ప్రజల కంటే భారతీయులు సంతోషంగా లేరని వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2023 వెల్లడించింది.
2002 గుజరాత్ అల్లర్ల సమయంలో సామూహిక అత్యాచారానికి గురైన బిల్కిస్ బానో కేసులో 11 మంది దోషుల శిక్షను తగ్గించడాన్ని వ్యతిరేకిస్తూ బిల్కిస్ బానో వేసిన పిటిషన్‌ను విచారించేందుకు ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు చేసేందుకు సుప్రీంకోర్టు బుధవారం అంగీకరించింది.
భారత్ మూడో చంద్ర మిషన్ చంద్రయాన్-3 క్రాఫ్ట్ పూర్తిగా సిద్ధంగా ఉందని, ఈ ఏడాది మధ్యలో ప్రయోగించవచ్చని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఛైర్మన్ ఎస్.సోమనాథ్ బుధవారం తెలిపారు.