పశ్చిమ బెంగాల్‌లోని పుర్బా మేదినీపూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని హల్దియా-మెచెడా రాష్ట్ర రహదారిపై ఆయిల్ ట్యాంకర్ బస్సును ఢీకొనడంతో 27 మంది ప్రయాణికులు గాయపడ్డారు.
ప్రముఖ నటి ఆకాంక్ష దుబే మరణ వార్తతో భోజ్‌పురి పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలోని ఓ హోటల్‌లో నటి శవమై కనిపించింది. 'మేరీ జంగ్ మేరా ఫైస్లా' సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన 25 ఏళ్ల ఆకాంక్ష ఆత్మహత్య చేసుకుని మరణించింది.
వాట్సాప్ గ్రూప్‌లో దైవదూషణ కంటెంట్‌ను పోస్ట్ చేశాడనే ఆరోపణలతో వాయవ్య పాకిస్థాన్‌లోని ఉగ్రవాద వ్యతిరేక కోర్టు ఓ ముస్లిం వ్యక్తిని దోషిగా నిర్ధారించి మరణశిక్ష విధించింది. ముస్లిం-మెజారిటీ పాకిస్తాన్‌లో దైవదూషణ అనేది చాలా సున్నితమైన సమస్య, ఇక్కడ నిరూపించబడని ఆరోపణలు కూడా హింసను రేకెత్తిస్తాయి.
ప్రధాని పర్యటన సందర్భంగా మరోసారి భద్రతా లోపం బయటపపడింది. శనివారం కర్ణాటకలోని దావణగెరెలో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ర్యాలీ సందర్భంగా భారీ భద్రతా ఉల్లంఘన జరిగింది.
ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో భారత జెండాను తీసివేసి, దాని స్థానంలో ఖలిస్తాన్ కోసం బ్యానర్‌ను ఏర్పాటు చేస్తామని బెదిరింపు వచ్చింది. సెప్టెంబరులో హైప్రొఫైల్ జీ20 సమావేశానికి ప్రగతి మైదాన్ వేదికగా ఉన్నందున పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు శనివారం తెలిపారు.
పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ప్రారంభించిన 'ఎర్త్ అవర్' కార్యక్రమాన్ని ఈ రోజు రాత్రి 8.30 గంటలకు జరుపుకోనున్నారు. రాత్రి 8.30 గంటలకు ఇళ్లు, కార్యాలయాల్లో ఒక గంట పాటు విద్యుత్ వాడకాన్ని నిలిపివేయనున్నారు.
ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్న కాన్‌మన్ సుకేష్ చంద్రశేఖర్ సహ ఖైదీలు, వారి కుటుంబాల సంక్షేమం కోసం రూ.5.11 కోట్లు విరాళంగా ఇచ్చేందుకు అనుమతి కోరుతూ జైళ్ల డైరెక్టర్ జనరల్‌కు లేఖ రాశారు. ఆఫర్ అంగీకరించబడితే, ఇది ఉత్తమ పుట్టినరోజు బహుమతి అవుతుందంటూ లేఖలో పేర్కొ్న్నాడు.
నీటి పన్ను చెల్లించడంలో విఫలమైనందుకు డెయిరీ నిర్వాహకుడికి చెందిన గేదెను మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ మున్సిపల్ కార్పొరేషన్ (జీఎంసి) శుక్రవారం స్వాధీనం చేసుకుంది. మొండిగా వ్యవహరించే ఎగవేతదారుల నుంచి ఆస్తి, నీటి పన్ను బకాయిలను వసూలు చేయడంలో భాగంగా ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఇంట్లో గొడవల కారణంగా ఓ వ్యక్తి తన భార్యను హతమార్చి, ఆత్మహత్య చేసుకున్నాడు. పశ్చిమ బెంగాల్‌లోని నాడియా జిల్లాలోని కృష్ణగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుతిర్పారా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ప్రధాని మోదీ ఇంటి పేరును ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలకు గానూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీకి సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించడంతో లోక్‌సభ సెక్రటేరియట్ ప్రజాప్రతినిధుల చట్టం ప్రకారం ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో సినీ నటి, బీజేపీ నాయకురాలు, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలుఖుష్బూ సుందర్ గతంలో ప్రధాని మోదీ ఇంటి పేరుపై చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.