Amruta Fadnavis: అమృత ఫడ్నవీస్‌కు లంచం ఇచ్చేందుకు యత్నం.. మహిళకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amruta Fadnavis: మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతకు లంచం ఇవ్వజూపినందుకు, ఆమెను బెదిరించినందుకు అరెస్టయిన అనిక్ష జైసింఘానిని ముంబైలోని కోర్టు శుక్రవారం నాడు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. ఆమె పోలీసు రిమాండ్ పొడిగించాలన్న పోలీసుల విజ్ఞప్తిని తిరస్కరించింది. అమృత ఫడ్నవీస్ ఫిర్యాదు మేరకు ఫిబ్రవరి 20న మలబార్ హిల్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసు ఆధారంగా మార్చి 16న అనిక్షను నగర పోలీసులు అరెస్టు చేశారు. ఆమె నుంచి రూ.10 కోట్లను డిమాండ్ చేసినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. గతంలో రిమాండ్ ముగియడంతో పోలీసులు అనిక్షను సెషన్స్ కోర్టు న్యాయమూర్తి డీడీ అల్మాలే ముందు హాజరుపరిచారు. పోలీసుల తరపున వాదించిన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అజయ్ మిసార్ మరో మూడు రోజుల కస్టడీని కోరారు. పోలీసు రిమాండ్ పొడిగింపునకు కొత్త కారణం ఏమీ లేదని అనిక్ష తరపు న్యాయవాది మనన్ సంఘై వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయస్థానం, విచారణాధికారుల విజ్ఞప్తిని తిరస్కరించి, నిందితులను జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.
ఈ కేసుకు సంబంధించి ఆమె తండ్రి, అనుమానిత బుకీ అనిల్ జైసింఘాని, వారి బంధువు నిర్మల్ జైసింఘానిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. వీరిద్దరూ మార్చి 27 వరకు పోలీసు కస్టడీలో ఉన్నారు. వీరిపై కుట్ర, దోపిడీ, అవినీతి నిరోధక చట్టంలోని నిబంధనలకు సంబంధించి ఇండియన్ పీనల్ కోడ్ (IPC) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ ప్రకారం, అనిక్ష గత 16 నెలలుగా అమృతా ఫడ్నవీస్‌తో టచ్‌లో ఉంది. ఆమె ఇంటికి కూడా వెళ్లింది.
Also Read
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
- VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్‌ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
Read Also: Raghav Chadha: బాలీవుడ్ గ్లామరస్ బ్యూటీతో డేటింగ్.. వైరల్ వీడియోలపై స్పందించిన ఆప్ నేత!
పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో అమృతా ఫడ్నవీస్ తాను నవంబర్ 2021లో అనిక్షను మొదటిసారిగా కలిశానని చెప్పింది. తాను బట్టలు, ఆభరణాలు, పాదరక్షల డిజైనర్ అని అనిక్ష పేర్కొంది. బహిరంగ కార్యక్రమాలలో వాటిని ధరించమని బీజేపీ నాయకుడి భార్యను అభ్యర్థించింది. ఇది తనకు ఉత్పత్తుల ప్రచారం చేయడంలో సహాయపడుతుందని అనిక్ష పేర్కొందని పోలీసులు చెప్పారు. అమృత నమ్మకాన్ని సంపాదించిన అనిక్ష.. కొంతమంది బుకీల సమాచారాన్ని అందజేస్తానని.. దాని ద్వారా వారు డబ్బు సంపాదించవచ్చని ఆమె పేర్కొంది. ఎఫ్‌ఐఆర్ ప్రకారం, పోలీసు కేసులో తన తండ్రిని తప్పించడానికి ఆమె నేరుగా అమృతకు రూ.కోటి ఆశజూపింది. అమృత ఫడ్నవీస్ అనిక్ష ప్రవర్తనతో కలత చెంది ఆమె నంబర్‌ను బ్లాక్ చేసినట్లు పోలీసులకు చెప్పింది.
తాజావార్తలు
-
Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
-
Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!