రైల్వే తన వివిధ విభాగాల కింద డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌లో అగ్నివీర్‌లకు నాన్-గెజిటెడ్ పోస్టులలో 15 శాతం సంచిత రిజర్వేషన్‌ను అందిస్తోంది. వారికి వయస్సు సడలింపు, ఫిట్‌నెస్ పరీక్షల నుండి మినహాయింపును కూడా అందజేస్తుందని రైల్వే వర్గాలు గురువారం తెలిపాయి. అగ్నివీరులకు వయస్సు, ఫిట్‌నెస్ పరీక్షలో సడలింపు ఉంటుంది.
మధ్యప్రదేశ్‌లోని కట్నీ స్టేషన్ సమీపంలో గురువారం సిమెంట్‌తో కూడిన గూడ్స్ రైలుకు చెందిన నాలుగు వ్యాగన్లు పట్టాలు తప్పినట్లు అధికారులు తెలిపారు. మధ్యాహ్నం పట్టాలు తప్పినట్లు అధికారులు వెల్లడించారు.
రోజు రోజుకు కామాంధులు రెచ్చిపోతున్నారు. త్రిపురకు చెందిన ఒక కళాశాల విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. పశ్చిమ త్రిపుర జిల్లాలో కదులుతున్న కారులో కళాశాల విద్యార్థినిపై ముగ్గురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం విషమ స్థితిలో ఉన్న ఆమెను పశ్చిమ త్రిపురలోని అమాతలి బైపాస్ వద్ద వదలిపెట్టి పరారయ్యారు.
రైతాంగ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. ఆఖరి ధాన్యం గింజ కొనే వరకు జనసేన ఉద్యమం చేపడుతుందని హెచ్చరించారు.
టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీలో చేరబోతున్నాడనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే తాను రాజకీయాలలోకి రావాలనుకుంటున్నట్లు అంబటి రాయుడు ఇంతకు ముందే ప్రకటించాడు. ఇదిలా ఉండగా.. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ఇవాళ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మహారాష్ట్రలో జూన్ 2022 రాజకీయ సంక్షోభంపై ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం తన ఉత్తర్వును ప్రకటించింది. ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వానికి పెద్ద ఊరటనిస్తూ, ఉద్ధవ్ థాకరే బలపరీక్షను ఎదుర్కోకుండా రాజీనామా చేసినందున ఆయన ప్రభుత్వాన్ని పునరుద్ధరించమని ఆదేశించలేమని సుప్రీంకోర్టు పేర్కొంది.
ఢిల్లీలో పాలనా వ్యవహారాలపై నియంత్రణ అధికారం ఎవరికి ఉండాలనే వివాదంలో కేంద్రానికి ఎదురుదెబ్బ తగిలింది. ఈ వివాదంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం గురువారం కీలక తీర్పును వెలువరించింది. సుప్రీం తీర్పుతో కేజ్రీవాల్ సర్కార్‌కు బిగ్ రిలీఫ్ లభించింది. ఎన్నికైన ప్రభుత్వానికే అసలైన అధికారాలు ఉంటాయని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.
ఈఎంఐ డబ్బులు కట్టమని తన కొడుకుకు ఓ తండ్రి 12 వేల రూపాయలు ఇవ్వగా.. అతను తన అవసరాలకు వాడుకున్నాడు. ఆ విషయం తెలిసిన తండ్రి.. కొడుకుని మందలించాడు. దీంతో మనస్తాపం చెందిన ఆ యువకుడు ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఒకరోజంతా బయట ఉండి తెల్లారి ఇంటికి వచ్చాడు. ఆ రాత్రికే స్నేహితుడి పుట్టినరోజు ఉందని చెప్పి బయటకు వచ్చి.. ఇన్స్టాలో ఇదే తన చివరి రోజంటూ పోస్ట్ పెట్టాడు.
అతిచిన్న వయస్సులోనే దేశ అత్యున్నత పదవిని చేపట్టారు ఫిన్‌లాండ్ ప్రధాని సనా మారిన్. పదవిని చేపట్టడమే కాకుండా డైనమిక్ పీఎంగా పేరు కూడా తెచ్చుకున్న సనా మారిన్ ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. తాజా ఫిన్‌లాండ్ ప్రధాని సనా మారిన్ విడాకులు తీసుకోనున్నట్లు ప్రకటించారు.