India vs South Africa: అహ్మదాబాద్‌లో టాస్ గెలిస్తే సగం మ్యాచ్ గెలిచినట్టే! పిచ్ రిపోర్ట్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs South Africa: భారత్, సౌతాఫ్రికా పోరుకు రంగం సిద్ధమైంది. ఇరు జట్లు ఇప్పటికే తామే గెలుస్తామన్న ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ టోర్నీలో అజేయంగా ముందుకు దూసుకెళ్తున్న టీమిండియా ఈ కీలక పోరులో మరో విజయాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. మ్యాచ్‌కు ముందు భారత బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ మాట్లాడుతూ.. భారత బ్యాటర్లు స్పిన్ బౌలింగ్ ఎదుర్కోవడంలో కొంత ఇబ్బంది పడ్డారని అంగీకరించారు. అయితే త్వరలోనే ఈ సమస్య నుంచి బయటపడతామని విశ్వాసం వ్యక్తం చేశారు. టోర్నీలో ఇప్పటివరకు ఆడిన పిచ్‌లు బ్యాటింగ్‌కు సులభంగా లేవని, ముఖ్యంగా స్లో బౌలర్లపై పరుగులు చేయడం కష్టమైందని తెలిపారు. ముంబైలో ఆ వ్యూహాన్ని ప్రయత్నించి కష్టాల్లో పడ్డామని, కానీ మంచి ప్లాట్‌ఫామ్ దొరికితే చివర్లో వేగంగా పరుగులు చేయగల సామర్థ్యం మనకు ఉందని చెప్పారు.
READ MORE: Jowar Recipes: “జొన్న గుగ్గిళ్లు” ట్రై చేయండి.. వెయిట్ లాస్, షుగర్ కంట్రోల్‌కు బెస్ట్ రెసిపీ..
Also Read
- India Womens Squad: జింబాబ్వేతో టీ20, వన్డే సిరీస్‌లు.. భారత మహిళా జట్టును ప్రకటించిన బీసీసీఐ..
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- West Bengal: మారనున్న పశ్చిమ బెంగాల్ పేరు.. కొత్త పేరు ఇదే!
- ICC Rankings: ఒక్క సెంచరీతో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్.. తగ్గిన విరాట్ కోహ్లీ ర్యాంక్..
పిచ్ విషయానికి వస్తే.. అహ్మదాబాద్‌లో వాతావరణం వేడిగా ఉంది. ఉష్ణోగ్రత సుమారు 36 డిగ్రీల వరకు ఉండే అవకాశం ఉంది. వర్షం వచ్చే సూచనలు లేవు కాబట్టి పూర్తి ఈ మ్యాచ్‌కు ఆటంకం ఉండదు. పశ్చిమ-వాయువ్య దిశ నుంచి సుమారు గంటకు 7 కి.మీ వేగంతో గాలులు వీయనున్నాయి. యూవీ ఇండెక్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఆటగాళ్లు వేడిని జాగ్రత్తగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. టీ20ల్లో భారత్-దక్షిణాఫ్రికా మధ్య ఇప్పటివరకు 31 మ్యాచ్‌లు జరిగాయి. భారత్ 18 మ్యాచ్‌ల్లో గెలవగా, దక్షిణాఫ్రికా 12 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది. అయితే.. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఇప్పటివరకు 15 టీ20 మ్యాచ్‌లు జరిగాయి. ముందుగా బ్యాటింగ్ చేసిన జట్లు 10 మ్యాచుల్లో గెలిచాయి. ఛేజింగ్ చేసిన జట్లు 5 సార్లు విజయం సాధించాయి. ఈ రిపోర్ట్స్ చూస్తే.. అహ్మదాబాద్‌లో టాస్ గెలిస్తే సగం మ్యాచ్ గెలిచినట్టే.! ఇక ఈ స్టేడియంలో తొలి ఇన్నింగ్స్ సగటు స్కోరు 173 కాగా, రెండో ఇన్నింగ్స్ సగటు 151 మాత్రమే ఉంది. భారత్ న్యూజిలాండ్‌పై చేసిన 234/4 అత్యధిక స్కోరు కాగా.. న్యూజిలాండ్ భారత్‌పై చేసిన 66 ఆలౌట్ కనిష్ట స్కోరుగా నిలిచింది. సౌతాఫ్రికా న్యూజిలాండ్‌పై చేసిన 178/3 అత్యధిక విజయవంతమైన చేజ్‌గా రికార్డు ఉంది. ఇక 107/7తో భారత్ మహిళలపై వెస్టిండీస్ మహిళలు కాపాడుకున్న స్కోరు అత్యల్ప డిఫెండెడ్ టోటల్‌గా ఉంది.
తాజావార్తలు
-
India Womens Squad: జింబాబ్వేతో టీ20, వన్డే సిరీస్‌లు.. భారత మహిళా జట్టును ప్రకటించిన బీసీసీఐ..
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
-
West Bengal: మారనున్న పశ్చిమ బెంగాల్ పేరు.. కొత్త పేరు ఇదే!
-
ICC Rankings: ఒక్క సెంచరీతో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్.. తగ్గిన విరాట్ కోహ్లీ ర్యాంక్..
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!