మణిపూర్ రాజధాని ఇంఫాల్ నగరంలో బుధవారం కర్ఫ్యూ సడలించడంతో, ప్రజలు అవసరమైన వస్తువులను కొనుగోలు చేయడానికి పెద్ద సంఖ్యలో మార్కెట్‌లకు తరలివచ్చారు. నగరంలోని ఇమా మార్కెట్‌కు జనం భారీగా తరలివచ్చారు. నగరంలోని పెట్రోల్ పంపుల వెలుపల పొడవైన క్యూలు కనిపించాయి.
మధ్యప్రదేశ్‌లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. కిక్కిరిసిన ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్ బస్సు అదుపుతప్పి నదిలో పడింది. ఈ ప్రమాదంలో 24 మంది ప్రాణాలు కోల్పోగా.. 40 మందికిపైగా గాయపడ్డారు.
బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌ను చంపేస్తానని గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ బెదిరించిన సంగతి తెలిసిందే. ఆయనకు మరోసారి బెదిరింపులు వచ్చాయి. ఈ సారి మాత్రం బెదిరించింది గ్యాంగ్‌స్టర్ కాదు.. ఓ విద్యార్థి.
అనకాపల్లి జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ ఆస్పత్రిలో మంగళవారం అర్ధరాత్రి ఓ సైకో వీరంగం సృష్టించాడు. గైనిక్ వార్డులోకి ప్రవేశించిన సైకో.. రాళ్లతో కిటికీలు ధ్వంసం చేశాడు.
తిరుపతి గంగమ్మ జాతర చాటింపుతో నేటి నుంచి ప్రారంభమైంది. వారం రోజుల పాటు ఈ జాతర కొనసాగనుంది. జాతర నేపథ్యంలో గ్రామస్థులు ఊరును విడిచి వెళ్లరాదని చాటింపు వేశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు రాత్రి పూట ఇక్కడ బస చేయకుండా వెళ్లిపోవాలి. జాతర ప్రారంభమైనందున అమ్మవారి అనుగ్రహం పొందేందుకు పూజలు నిర్వహించుకోవాలి.. అంటూ సంప్రదాయం ప్రకారం కైకాల వంశస్తులు తిరుపతి గంగజాతర మంగళవారం అర్ధరాత్రి తర్వాత చాటింపు వేశారు.
ఏపీ వ్యాప్తంగా పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ పాలిసెట్–2023 పరీక్ష ఇవాళ జరగనుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశామని సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి మంగళవారం ప్రకటించారు. మొత్తం 61 పట్టణాల్లో 499 కేంద్రాల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష నిర్వహించనున్నారు.
గుజరాత్‌లోని వల్సాద్ జిల్లాలోని వాపి పట్టణానికి సమీపంలో ఉన్న ఆలయం నుండి తన భార్య తిరిగి వచ్చేందుకు ఎస్‌యూవీ వాహనంలో వేచి ఉన్న స్థానిక బీజేపీ కార్యకర్తను గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం ఉదయం కాల్చి చంపారని పోలీసులు తెలిపారు.
వివాదాస్పదమైన ‘ది కేరళ స్టోరీ’ సినిమా కొత్త తరహా ఉగ్రవాదాన్ని బయటపెట్టిందని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. బెంగళూరులో ఈ చిత్రాన్ని ఆయన ఆదివారం వీక్షించారు.