ఏపీలో ప్రజలు రానున్న 3 రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. వచ్చే 3 రోజులు రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇప్పటికే పలుచోట్ల సాధారణ ఉష్ణోగ్రతలకంటే 2 నుంచి 4 డిగ్రీలు ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
మన్యం దేవత.. గిరిజనుల కల్పవల్లి.. కోరికలు తీర్చే కొంగు బంగారం… ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం.. పాడేరు మోదకొండమ్మ తల్లి. అమ్మవారి మూడురోజుల ఉత్సవాలు అంగరంగా వైభవంగా జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే రెండవ గిరిజన జాతరగా పాడేరు మోదకొండమ్మ జాతర పేరొందింది.
తిరుమలలో హనుమజ్జయంతి వేడుకలను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఘనంగా నిర్వహిస్తోంది. తిరుమలలోని అంజనాద్రిపై ఈ నెల 14వ తేదీ(నేటి) నుంచి 18వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రారంభమవుతుంది. పోస్టల్, బ్యాలెట్లు వయోవృద్ధుల ఓట్లు లెక్కిస్తారు. ఈ సారి వయో వృద్ధులకు ఇంట్లో నుంచే ఓటు విధానం కల్పించారు. ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది.
బంగాళాఖాతం నుంచి బంగ్లాదేశ్ తీరానికి చేరుకునే అతి తీవ్రమైన తుఫాను ‘మోచా’తో దేశంలోని తీర ప్రాంతాలు, ఓడరేవులలో ఆందోళనలు పెరుగుతున్నాయి. మూడు ఓడరేవులు, 12 జిల్లాలకు భారీ ప్రమాదం ఉందని ఆ దేశ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రమాద హెచ్చరిక నం.8ను దేశ వాతావరణ కార్యాలయం జారీ చేసింది.
శివసేన, సేన పోరుపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే రాజీనామా చేయాలని డిమాండ్ చేయాల్సిన అవసరం లేదని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత అజిత్ పవార్ శుక్రవారం అన్నారు.
కష్టపడి చదువుకొని గవర్నమెంట్ కొలువు సంపాదించి ఒక ఉన్నత స్థాయికి ఎదిగి లక్షల్లో జీతం తీసుకుంటూ కూడా కొంతమంది కుక్కతోక వంకర అన్నట్లుగా అనేక అక్రమాలకు పాల్పడుతుంటారు. గవర్నమెంట్ ఇచ్చే జీతాలు చాలావనో లేక దొరికింది దోచేయాలన్న ఉద్దేశంతోనో కొంతమంది అధికారులు కనిపించిన చోటల్లా తమ చేతివాటం ప్రదర్శిస్తుంటారు.