కృష్ణా జలాల్లో నీటి వాటాలను తేల్చకుండానే కేఆర్‌ఎంబీ సమావేశం ముగిసింది. నదీ జలాల కేటాయింపు న్యాయబద్ధంగా జరగాలని తెలంగాణ వాదిస్తే.. 66:34 నిష్పత్తిలో ఉండాలని ఏపీ వాదిస్తోంది. ఇదిలా ఉండగా.. కేంద్రం తొమ్మిదేళ్ల నుంచి నీటి వాటాలపై ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని తెలంగాణ ఆరోపిస్తోంది.
జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. పవన్ కల్యాణ్‌కు 10 పంటలు చూపిస్తే అందులో ఐదు పంటలను గుర్తించలేడని విమర్శించారు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. పంటలు ఎలా పండిస్తారో కూడా పవన్‌కు తెలియదని ఆయన వ్యాఖ్యానించారు.
పాకిస్థాన్ మాజీ ప్రధాని, పీటీఐ అధినేత ఇమ్రాన్‌ఖాన్ అరెస్ట్ నేపథ్యంలో ఆ దేశంలో పరిస్థితి గందరగోళంగా తయారైంది. పాక్‌లో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. మంగళవారం ప్రారంభమైన అల్లర్లు, ఆందోళనలు బుధవారమూ కొనసాగాయి. పలుచోట్ల విధ్వంసాలు చోటుచేసుకున్నాయి. ఏడుగురు మృతి చెందగా 300 మందికి గాయాలయ్యాయి.
పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో పొలిటికల్ హైడ్రామాకు తెరలేచింది. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఇరగవరం నుంచి తణుకు వరకు రేపు చంద్రబాబు పాదయాత్ర చేపట్టనున్నారు.
సిక్కుల పవిత్ర యాత్రా స్థలంగా ప్రసిద్ధిగాంచిన అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయం సమీపంలో వరుస పేలుడు ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్ సమీపంలో గురువారం తెల్లవారుజామున పేలుడు శబ్దం వినిపించిందని పలు వర్గాలు తెలిపాయి.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేడు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ది కార్యక్రమాల ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు. గురువారం మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 3.20 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు.
జేడీఎస్ ఎన్నికల అనంతర పొత్తును కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ రద్దు చేశారు. తమ పార్టీకి అసెంబ్లీలో పూర్తి మెజారిటీ వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. "జేడీఎస్‌తో పొత్తుకు అవకాశం లేదు. మేమే సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాము." అని శివకుమార్ కర్ణాటక శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ఓటు వేసిన అనంతరం విలేకరులతో అన్నారు.
యూకేలో ఓ సంచలనాత్మక శాస్త్రీయ పద్ధతిలో ముగ్గుల వ్యక్తుల డీఎన్‌ఏతో సృష్టించబడిన మొదటి శిశువు జన్మించింది. ఈ ప్రక్రియలో 99.8శాతం డీఎన్‌ఏ ఇద్దరు తల్లిదండ్రుల నుంచి వస్తుందని, మిగిలినది మహిళా దాత నుంచి వస్తుంది.