మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విటర్‌కు ఎలాన్ మస్క్ గుడ్‌బై చెప్పబోతున్నారు. ట్విటర్‌కు కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌ను ఎంపిక చేసినట్లు మస్క్ ప్రకటించారు. ఆరు వారాల్లో నూతన సీఈవో బాధ్యతలు చేపట్టనున్నారని స్పష్టం చేశారు. ఇదంతా చెప్పిన మస్క్.. కొత్త సీఈవో ఎవరో మాత్రం చెప్పలేదు. అయితదే ఈ రేసులో లిండా యాకరినో పేరు ముందుంది.
అవినీతి కేసులో అరెస్టయిన పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను జైలులోనే హతమార్చేందుకు కుట్ర పన్నారని ఆరోపిస్తూ దేశ వ్యాప్తంగా పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. అతడిని చిత్రహింసలకు గురిచేశారని, గుండెపోటు వచ్చేలా ఆహారం, ఇంజెక్షన్ ఇచ్చారని ఇమ్రాన్ తరఫున వాదించే లాయర్లు పేర్కొన్నారు.
ఇవాళ సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా దాదాపు 16 లక్షల మంది విద్యార్థులు ఆసక్తితో ఎదురుచూస్తోన్న సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈరోజు 12వ తరగతి ఫలితాలు వెలువడినందున విద్యార్థుల మధ్య అనారోగ్యకరమైన పోటీని నివారించడానికి మెరిట్ జాబితా, డివిజన్ వారీ మార్కులను విడుదల చేయబోమని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) తెలిపింది.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) శుక్రవారం 12వ తరగతి బోర్డు పరీక్ష ఫలితాలను ప్రకటించింది. ఈ విషయాన్ని బోర్డు తన ట్విట్టర్ హ్యాండిల్‌లో ప్రకటించింది. దేశవ్యాప్తంగా దాదాపు 16 లక్షల మంది విద్యార్థులు ఆసక్తితో ఎదురుచూస్తోన్న CBSE 12వ తరగతి ఫలితాలు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.
టెలివిజన్ నటి జెన్నిఫర్ బన్సీవాల్ 'తారక్ మెహతా కా ఊల్తా చష్మా' టీవీ షో నుంచి తప్పుకున్నారు. 'తారక్ మెహతా కా ఊల్తా చష్మా' నిర్మాత అసిత్ మోడీపై నటి లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. ఆమె అతనిపై తీవ్ర ఆరోపణలు చేసింది.
డ్రోన్లను ఉపయోగించి పాక్ నుంచి డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్న ముగ్గురిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్థాన్ నుంచి డ్రగ్స్‌తో సంబంధం ఉన్న ముగ్గురు భారతీయులను ఢిల్లీ పోలీసుల కౌంటర్ ఇంటెలిజెన్స్ యూనిట్ పట్టుకుంది.
మధ్య బంగాళాఖాతంలో వచ్చే ఆరు గంటల్లో మోచా తుఫాను తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శుక్రవారం హెచ్చరిక జారీ చేసింది. ఆ తర్వాత తుఫాను మరింత బలపడి ఉత్తర-ఈశాన్య దిశగా కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
టెస్లా అధినేత, ట్విటర్ సీఈవో ఎలాన్ మస్క్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విటర్‌కు గుడ్‌బై చెప్పబోతున్నారు. ట్విటర్‌కు కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌ను ఎంపిక చేసినట్లు మస్క్ ప్రకటించారు. ఆరు వారాల్లో నూతన సీఈవో బాధ్యతలు చేపట్టనున్నారని స్పష్టం చేశారు. ఇదంతా చెప్పిన మస్క్.. కొత్త సీఈవో ఎవరో మాత్రం చెప్పలేదు. ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా, ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్ ఎక్స్ అధినేతగా తీరిక లేని షెడ్యూల్‌ను గడుపుతోన్న నేపథ్యంలో ఆయన ఈ…