The Kerala Story 2: ‘‘ఇలా గొడ్డు మాంసం ఎవరు తినిపిస్తారు.?’’ కేరళ స్టోరీపై అనురాగ్ కశ్యప్ విమర్శలు..
- ది కేరళ స్టోరీ 2 సినిమా వివాదం..
- ‘‘బీఫ్ సీన్’’పై అనురాగ్ కశ్యప్ ఆగ్రహం..
- డబ్బు సంపాదన, సమాజ విభజన చిత్రంగా విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
The Kerala Story 2: విడుదలకు ముందే ‘‘ది కేరళ స్టోరీ 2’’ ప్రకంపనలు సృష్టిస్తోంది. ముఖ్యంగా కేరళలో అధికార కమ్యూనిస్ట్ పార్టీ, ప్రతిపక్ష కాంగ్రెస్ ఈ సినిమాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. సీఎం పినరయి విజయన్ కూడా మండిపడుతున్నాడు. కేరళలో మతాల మధ్య చిచ్చు పెట్టాలని ఇలాంటి సినిమాలు తీస్తున్నారని విమర్శిస్తున్నారు. కేరళను ఉగ్రవాదానికి కేంద్రంగా చూపించే ప్రయత్నాలను తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు.
Read Also: Jowar Recipes: “జొన్న గుగ్గిళ్లు” ట్రై చేయండి.. వెయిట్ లాస్, షుగర్ కంట్రోల్‌కు బెస్ట్ రెసిపీ..
Also Read
- Rajinikanth Dharman: సూపర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్.. విలన్ రోల్లో తెలుగు స్టార్ హీరో!
- SS Rajamouli: రాజమౌళి నెక్స్ట్ హీరో అతడేనా..? హింట్ ఇచ్చేసిన జక్కన్న..!
- Golden Bhagyam Glimpse: టాలీవుడ్, కోలీవుడ్ కమెడియన్ల సినిమా.. నవ్వులు పూయిస్తోన్న గ్లింప్స్!
- Tollywood Shooting Updates: టాలీవుడ్ లో మళ్లీ షూటింగ్ సందడి.. ఏ హీరో సినిమా ఎక్కడ జరుగుతుందంటే..!
ఇదిలా ఉంటే, ది కేరళ స్టోరీ 2 విమర్శకుల జాబితాలో బాలీవుడ్ డైరెక్టర్, యాక్టర్ అనురాగ్ కశ్యప్ కూడా చేరారు. ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ కోసం కొచ్చికి వచ్చిన అనురాగ్‌ను “ది కేరళ స్టోరీ 2” గురించి విలేకరులు ప్రశ్నించగా, ఆయన సినిమాపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సినిమా ద్వారా సమాజాన్ని విభజించాలని చూస్తున్నారని, డబ్బు సంపాదించడానికి తీసిన ఒక ప్రాపగండా అని అభివర్ణించారు. ఈ సినిమా ట్రైలర్‌లో ఒక ముస్లిం కుటుంబం, హిందూ యువతికి బలవంతంగా బీఫ్(గొడ్డు మాంసం) తినిపిస్తున్నట్లు చూపించారు. దీనిపై అనురాగ్ కశ్యప్ మాట్లాడుతూ.. నిజ జీవితంలో ఎవరూ కూడా అలా చేయరని, బీఫ్ కాదు కనీసం ఎవరూ బలవంతంగా కిచిడీ కూడా తినిపించరని అన్నారు.
సినిమా నిర్మించిన వారు కేవలం లాభాల కోసమే చూస్తున్నారని, సమాజంలో ద్వేషాన్ని పెంచి పోషించి డబ్బు సంపాదించుకోవాలని అనుకుంటున్నారని విమర్శించారు. ఈ చిత్రం ప్రజలను విడదీసేలా ఉందని, వాస్తవాలకు దూరంగా ఉందని చెప్పారు. కామాఖ్య నారాయణ్ సింగ్ దర్శకత్వం వహించి విపుల్ అమృత్‌లాల్ షా నిర్మించిన “ది కేరళ స్టోరీ 2” ఫిబ్రవరి 27న థియేటర్లలో విడుదల కానుంది.
తాజావార్తలు
-
CJP: ‘‘శివాజీ పార్క్‌లో అడుగుపెట్టనివ్వం’’.. సీజేపీకి ముంబై స్థానికుల ఝలక్!
-
Khairatabad By Polls : ఉప ఎన్నికపై అధికార పార్టీ వ్యూహం ఏంటి?
-
OTR: కొత్తగూడెం బీఆర్ఎస్లో సరికొత్త సమీకరణాలు..
-
Jammu Kashmir: CISF క్యాంపులో కలకలం..హెడ్ కానిస్టేబుల్ కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతి
-
Pawan Kalyan: పల్లె సీమల్లో అభివృద్ధి పరుగులు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!