సెంట్రల్ రైల్వేకు చెందిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF), మహారాష్ట్ర పోలీసులు బుధవారం బీహార్-పుణె రైలులో ఆపరేషన్ నిర్వహించి మానవ అక్రమ రవాణాదారుల నుండి 59 మంది పిల్లలను రక్షించారు.
మాజీ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ మేనల్లుడు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించేందుకు క్రికెటర్ జాస్ ఇందర్ సింగ్ నుంచి రూ. 2 కోట్లు డిమాండ్ చేసినట్లు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఆరోపించారు.
మహిళా రెజ్లర్ల నుంచి లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ బుధవారం నాడు తనపై ఒక్క ఆరోపణ రుజువైనా ఉరివేసుకుంటానని అన్నారు.
వారణాసిలోని జ్ఞాన్‌వాపి కాంప్లెక్స్‌లో పూజించే హక్కును కోరుతూ హిందువులు చేసిన విజ్ఞప్తిని అలహాబాద్ హైకోర్టు పేర్కొంది. వారణాసిలోని జ్ఞానవాపిలో కొలువై ఉన్న శృంగార గౌరీని నిత్య పూజించే హక్కు విషయంలో హిందూ పక్షానికి అనుకూలంగా నిర్ణయం వచ్చింది.
దేశవ్యాప్తంగా గిడ్డంగుల సామర్థ్యం పెంపునకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సహకార రంగంలో పెద్ద ఎత్తున గోదాములు ఏర్పాటు చేసేందుకు కేంద్రం రూ.లక్ష కోట్లతో గిడ్డంగుల కోసం కొత్త పథకాన్ని రూపొందించనుండగా.. 700 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను నిల్వ ఉంచే లక్ష్యంతో ఈ పథకం ఉండనుంది.
కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేత రాహుల్ గాంధీ.. అమెరికా పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆయన అమెరికా వేదికగా బీజేపీ ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు. మోడీ సర్కారు భారత ప్రజలను భయపెడుతోందని, దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు.
భారత్ సరిహద్దుల్లో ముగ్గురు ఉగ్రవాదులు అరెస్ట్ చేశారు. పాకిస్థాన్ నుంచి జమ్ముకశ్మీర్‌లోకి ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని భారత సైన్యం తిప్పికొట్టింది. మంగళవారం అర్ధరాత్రి ఒంటిగంటకు జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్ గుండా కొందరు ఉగ్రవాదులు వాస్తవాధీన రేఖ దాటి భారత్‌లో చొరబడేందుకు ప్రయత్నించారు.
లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా పోరాడుతున్న రెజ్లర్లకు మద్ధతుగా రేపు రైతులు పెద్ద సంఖ్యలో సమావేశం నిర్వహించనున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలోని సౌరం పట్టణంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ నిలిచిపోయింది. ఉదయం నుంచి ఆర్టీఏ కార్యాలయాల్లో కార్యకలాపాలు నిలిచిపోయాయి. రవాణా శాఖ సర్వర్ డౌన్ కావడం వల్ల కార్యకలాపాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి.